Breaking News

ఉద్యోగ ఖాళీలెన్ని ?

Published on Fri, 08/30/2024 - 03:10

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన జాబ్‌ కేలండర్‌ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు నియామక సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీతో పాటు విద్యుత్‌ సంస్థల పరిధిలో ఏఈఈ, ఏఈ, సబ్‌ ఇంజనీర్‌ పోస్టులతో పాటు గెజిటెడ్‌ కేటగిరీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధిత నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో సీఎస్‌ శాంతికుమారి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక సంస్థల చైర్మన్లు, కార్యదర్శులు, సభ్యులతో గత వారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఉద్యోగ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.  వీలైనంత వేగంగా గ్రూప్‌–1 ఖాళీలతో పాటు ఇంజనీరింగ్‌ ఉద్యోగ ఖాళీలు తేలి్చ, వివరాలు ఆర్థిక శాఖకు సమరి్పంచాలని ఆదేశించారు.  

ప్రభుత్వ శాఖలు బిజీ బిజీ 
సీఎస్‌ ఆదేశాల నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు వాటి పరిధిలోని ఖాళీలు గుర్తించడంతో పాటు, వాటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఖాళీల లెక్కలు తేలి్చన తర్వాత ఆర్థిక శాఖకు సమరి్పంచాల్సి ఉంటుంది. 

ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన పూర్తి చేసి, ఆ మేరకు ప్రతిపాదనలను నియామక సంస్థలకు అప్పగించాలి. రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచి్చన తర్వాత రెండోసారి గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. విద్యుత్‌ సంస్థల్లో కొన్ని ఇంజనీరింగ్‌ ఉద్యోగాల భర్తీ రెండోసారి, కొన్నిటి భర్తీ మూడోసారి జరుగుతున్నట్లు సమాచారం.  

కేలండర్‌ ప్రకారం ప్రకటనలు 
తెలంగాణ ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), సబ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ కేలండర్‌లో స్పష్టం చేసింది. టీజీజెన్‌కో ఈ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలి. 

అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా అక్టోబర్‌లోనే జారీ చేయాలి. ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టాలి. జీవో 55లో గుర్తించిన 19 కేటగిరీల్లోని పోస్టులు గ్రూప్‌–1 పరిధిలోకి వస్తాయి. ఈ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ జారీ చేయాలి. జాబ్‌ కేలండర్లో నిర్దేశించిన నెలల్లో ఆయా ప్రకటనలు జారీ చేయాలని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ శాఖలను సర్కారు ఆదేశించింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)