Breaking News

బాలాపూర్‌ లడ్డూ మోదీకి అంకితం: కొలను శంకర్‌రెడ్డి

Published on Tue, 09/17/2024 - 10:52

సాక్షి, హైదరాబాద్‌: బాలాపూర్‌ గణపతి లడ్డూ వేలంలో మరో​సారి రికార్డు స్ధాయి ధర​ పలికింది. చరిత్రను తిరగరాస్తూ ఈసారి రూ.30లక్షల ఒక వేయికి లడ్డూను దక్కించుకున్నారు బీజేపీ నేత కొలను శంకర్‌ రెడ్డి.  ఈ సందర్భంగా లడ్డూను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. త్వరలో ఢిల్లీకి వెళ్లి పూర్తి లడ్డూను ఆయనకే అందిస్తానని చెప్పారు.  

వేలం పాట రూ.1116తో ప్రారంభమై.. క్రమంగా పెరుగుతూ.. రూ.30 లక్షల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్‌ రెడ్డికే బాలాపూర్‌ లడ్డూ దక్కింది. గతేడాది కూడా లడ్డూ రూ.27లక్షల పలికిన విషయం తెలిసిందే. దీంతో, గతేదాడి కంటే మూడు లక్షల ఒక్క వేయి ఎక్కవ పలికింది. 

కాగా, బాలాపూర్‌ లడ్డూ వేలం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైంది. లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తుంటారు. ఇక, ఈ ఏదాడికి బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి అయ్యింది. 1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. తొలిసారి వేలంలో లడ్డూ రూ.450 పలికింది. ఇక, 30 ఏళ్ల నాటికి లడ్డూ ఏకంగా రూ.30లక్షలకు చేరుకుంది. ఇదే ఓ రికార్డుగా స్థానికులు చెప్పుకుంటున్నారు.

30ఏళ్లుగా వేలం ఇలా..

  • 1994లో తొలిసారి రూ.450తో ప్రారంభం 
  • 2016లో రూ.14.65 లక్షలు, 
  • 2017లో రూ.15.60లక్షలు, 
  • 2018లో రూ.16.60 లక్షలు, 
  • 2019లో 17.60 లక్షలు, 
  • 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు
  • 2021లో రూ.18.90 లక్షలు, 
  • 2022లో రూ.24.60 లక్షలు 
  • 2023లో రూ.27 లక్షలు 
  • 2024లో రూ.30,01,000(30లక్షల ఒక వేయి).

 

 ఇది కూడా చదవండి:  వేలంలో రికార్డులు పటాపంచల్‌.. గణేశుడి లడ్డూ@ రూ.1.87 కోట్లు

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)