Breaking News

శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు వరద

Published on Sun, 09/28/2025 - 04:52

నాగార్జునసాగర్‌/కన్నాయిగూడెం/ దోమలపెంట: కృష్ణా బేసిన్‌లో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారిగా 5 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా 5,03,100, సుంకేసుల నుంచి 71,136, హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కులు మొత్తం 5,77,986 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను ఒక్కొక్కటి 20 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 4,61,560 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. 

అలాగే ఎడమ, కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 64,695 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,26,255 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.5 అడుగుల వద్ద 202.0439 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్‌ 26 గేట్లను 10 అడుగులు ఎత్తి స్పిల్‌వే మీదుగా 3,76,402 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో మరో 33,373 క్యూసెక్కులు వదులుతున్నారు. 

సాగర్‌ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 587.30 అడుగులు (305.6838 టీఎంసీలు) ఉంది. భారీ వర్షాల వల్ల ఆయకట్టు పొలాలకు నీటి అవసరాలు తగ్గడం, కాల్వల కరకట్టలు జారిపోయే ప్రమాదం ఉండటంతో సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వెళ్లే కుడి కాల్వకు మాత్రం 8,023 క్యూ సెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 

భారీ వర్షాలతో గోదావరిలో నీటిమట్టం కూడా వేగంగా పెరుగుతోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తు పాకులగూడెం గ్రామంలోని సమ్మక్కసాగర్‌ బరాజ్‌కు 6,72,140 క్యూసెక్కుల వరద వస్తోంది. బరాజ్‌ 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)