Breaking News

Manickam Tagore: చక్కదిద్దలేక.. స్వచ్ఛందంగా..!

Published on Thu, 01/05/2023 - 03:46

సాక్షి, హైదరాబాద్‌: మాణిక్యం ఠాగూర్‌.. కాంగ్రెస్‌ రాష్ట్రాల ఇన్‌చార్జుల జాబితాలో పాపులర్‌ అయిన పేరు ఇది. తెలంగాణ ఇన్‌చార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ మూడు కొట్లాటలు, ఆరు తగాదాలన్నట్టుగా నిత్యం వార్తల్లో నిలిచింది. 2020 సెప్టెంబర్‌లో బాధ్యతలు తీసుకున్న ఆయన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకునే వరకు ప్రతిరోజూ ఏదో ఒక తలనొప్పితోనే సతమతమయ్యారు.

పార్టీ నేతలను సమన్వయం చేయలేక, పరిస్థితులను చక్కదిద్దలేక, అధిష్టానానికి ఏం చెప్పాలో అర్థం కాక నానా అవస్థలు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత ఈ తలనొప్పులు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టడం, తెలంగాణ కాంగ్రెస్‌ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి వైదొలగడం చర్చనీయాంశమయ్యింది. ఆయన రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పుకుంటారని, కొత్త ఇన్‌చార్జి వస్తారనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. 

విఫల ఇన్‌చార్జిగా మిగిలిపోతానని..! 
రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించేందుకు మాణిక్యం ఠాగూర్‌ విముఖత వ్యక్తం చేయడం వెనుక పలు కారణాలున్నాయని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పారీ్టలోని కయ్యాలు తన వ్యక్తిగత కెరీర్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. తాను ఇన్‌చార్జిగా వచ్చిన తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ వైఫల్యం తనకు చుట్టుకుంటే తానో విఫల ఇన్‌చార్జిగా మిగిలిపోతాననే ఆందోళన ఆయన రాష్ట్ర పార్టీ నేతల వద్ద వ్యక్తం చేశారు.

పార్టీ పరిస్థితులను చక్కదిద్దలేకపోయానని అధిష్టానం భావిస్తే సంస్థాగతంగా కూడా తనకు ఇబ్బంది అవుతుందని భావించే వారని మాణిక్యంతో సన్నిహితంగా ఉన్న నేతలు వెల్లడించారు. దీనికి తోడు లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నా.. తన సొంత నియోజకవర్గమైన విదురకు సమయం ఇవ్వలేకపోతున్నానని, కోరుకున్న విధంగా తమిళనాడు పీసీసీ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను నియోజకవర్గానికి వెళ్లిపోతానని ఆయన చెప్పేవారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)