Breaking News

1 నుంచి నెలవారీ రేషన్‌ కోటా

Published on Sun, 08/17/2025 - 11:10

సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 1 నుంచి యథావిధిగా ప్రజా పంపిణీ కేంద్రాల (రేషన్‌ దుకాణాలు) ద్వారా సన్న బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్‌ నెలలో ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం పంపిణీ చేసిన నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్‌ దుకాణాలు మూసివేశారు.

 సెప్టెంబర్‌ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ నెల కోటా సన్న బియ్యాన్ని రాష్ట్ర స్థాయి గోదాముల (స్టేజ్‌–1) నుంచి మండల్‌ లెవల్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లను పౌరసరఫరాల సంస్థ పర్యవేక్షిస్తోంది. 

సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారందరికీ సెప్టెంబర్‌ నెలలో సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈసారి లబ్ధిదారులకు బియ్యంతో పాటు చేతి సంచిని (బ్యాగ్‌) అందజేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)