Breaking News

Hyderabad: ర్యాష్‌ డ్రైవ్‌.. తగ్గేదేలే!

Published on Tue, 10/22/2024 - 07:24

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నట్టుండి నడిరోడ్డుపై వాహనాలు స్తంభించిపోతాయి. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులకు అసలు ఏం జరిగిందో తెలియదు. ఇలాంటి పరిస్థితికి చాలా సందర్భాల్లో కారణం ఒకటే ఉంటుంది. అదే రోడ్‌రేజ్‌. వేగంగా వస్తూ అదుపుతప్పి ఎదురుగా వచ్చే వాహనాన్ని స్వల్పంగా ఢీకొట్టడం.. దీంతో తగ్గేదేలె... అన్నట్టుగా ఇరువాహనాల చోదకులు ఢీ అంటే ఢీ అనే లెవల్లో ఘర్షణ పడుతుంటారు. తప్పు తమది కాదంటే తమది కాదంటూ తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. 

తీవ్రమైన ఆగ్రహావేశాలకు గురవుతుంటారు. ఆకస్మికంగా తలెత్తే ఈ కోపం తరచూ భౌతికదాడులకు దారితీస్తోంది. ఫలితంగా ఇతర వాహనదారుల సమయం గంటలకొద్దీ ట్రాఫిక్‌లోనే హరించిపోతుంది. ఈ రోడ్‌రేజ్‌ ఘటనలు గ్రేటర్‌లో ప్రతిరోజు వందలకొద్దీ చోటుచేసుకుంటున్నాయి. రవాణాశాఖ అంచనాల ప్రకారం... రోడ్డు ప్రమాదాలకు అధిక వేగం, ర్యాష్‌ డ్రైవింగ్, రోడ్‌రేజ్‌లే కారణాలు. నగరంలో రోజుకు 20 ప్రమాదాలు చోటుచేసుకొంటే వాటిలో కనీసం ఏడు ర్యాష్‌ డ్రైవింగ్, రోడ్‌రేజ్‌ కారణాలని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  



ఈగో దెబ్బతినడమే కారణమా... 
👉 వారం రోజుల క్రితం సికింద్రాబాద్‌– అమీర్‌పేట్‌ రహదారిలోని ఫ్లై ఓవర్‌పై ఓ కారు వేగాన్ని నియంత్రించే క్రమంలో ముందున్న ఆటోరిక్షాను తాకింది. ఈ ఉదంతంలో దానికి ఎలాంటి నష్టం జరగకపోయినా సదరు ఆటోవాలా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు, కారు నడిపే వ్యక్తిని అసభ్యంగా దూషించాడు. కారు యజమాని సైతం అదేస్థాయిలో ఆటోవాలాపై విరుచుకుపడ్డాడు. ట్రాఫిక్‌ రద్దీ కారణంగా వాహనాన్ని అదుపు చేసే క్రమంలో స్వల్పంగా తాకిందని కారు యజమాని వివరణ ఇచ్చాడు. ఖరీదైన కారు ఉన్న తాను ఆటోవాలాకు సారీ చెప్పడమేమిటని భావించాడు. కానీ, అతడు క్షమాపణ చెప్పకపోవడంతో ఆటోవాలా ఈగో దెబ్బతిన్నది. ఈ ఘర్షణ చినికి చినికి గాలివానగా మారడంతో వాహనాలు స్తంభించాయి. చివరకు ట్రాఫిక్‌ పోలీసులు జోక్యం చేసుకోవలసి వచి్చంది. 

👉ఏడాది క్రితం అత్తాపూర్‌లో ఒక క్యాబ్‌వాలాపై కూడా రోడ్‌రేజ్‌ దాడి జరిగింది. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు క్యాబ్‌ను ఢీకొట్టబోయి త్రుటిలో నిలిచిపోయింది. ఆ క్షణంలో తీవ్రమైన భయాందోళనకు గురైన క్యాబ్‌డ్రైవర్‌ వారితో గొడవకు దిగాడు. కారులో ఉన్నవాళ్లు సైతం తాము వాహనాన్ని కాస్త దూరంగానే ఆపామని, ఢీకొట్టలేదని వాదనకు దిగారు. క్యాబ్‌వాలా వెనక్కి తగ్గకపోవడంతో కారులోఉన్నవారు అతనిపై దాడి చేసి పరారయ్యారు. 

👉 ఈవిధంగా నగరంలో ఎక్కడో ఒక చోట రోడ్‌రేజ్‌ ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ పోలీసు రికార్డుల్లో పెద్దగా నమోదు కావడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. కేవలం సర్దుబాటుతో సద్దుమణిగే దానికి కూడా ఆకస్మిక కోపానికి గురికావడం ఆందోళనకరంగా మారుతోంది.

ప్రాణాలు హరిస్తున్నారు..
ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్ల జరిగే ప్రమాదాలపైన నమోదయ్యే కేసుల్లో రోడ్‌రేజ్‌ కచి్చతంగా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం అల్వాల్‌ శ్రీనివాస్‌నగర్‌ కాలనీలో ఒక ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై దీపక్‌ అనే వ్యక్తి వెళ్తున్నాడు. అదేమార్గంలో జి.ఆంజనేయులు అనే ఓ పెద్దాయన రోడ్డుదాటుతున్నాడు. కానీ, ఆకస్మికంగా తనముందు నుంచి బండి వేగంగా దూసుకెళ్లడంతో భయాందోళనకు గురయ్యాడు. వాహనదారుడిపైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పిదాన్ని గ్రహించి క్షమాపణ చెప్పి వెళ్లాల్సిన దీపక్‌ సీనియన్‌ సిటీజన్‌తో ఘర్షణకు దిగడమే కాకుండా కిందకు తోసివేయడంతో తలకు బలమైన గాయమైంది. రెండు వారాలపాటు చికిత్స తీసుకున్నా ఫలితం దక్కలేదు. చివరకు ఆ పెద్దాయన కన్నుమూశాడు. ఈ సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ రోడ్‌రేజ్‌లో భాగమే.. 
👉 వేగంగా వాహనం నడుపుతూ ఇతర వాహనదారులను, పాదచారులను భయభ్రాంతులకు గురిచేయడం 
👉   అదేపనిగా హారన్‌ మోగించడం 
👉  ర్యాష్‌ డ్రైవింగ్‌.. 
👉    హిట్‌ అండ్‌ రన్‌ 
👉    రహదారిభద్రత నిబంధనల మేరకు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. కానీ, 
రోడ్‌రేజ్‌పై ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు     తీసుకోవడం లేదు.   

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)