రామోజీకి అశ్రు నివాళి

Published on Mon, 06/10/2024 - 04:46

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపార­వేత్త చెరుకూరి రామోజీ­రావు అంత్యక్రి­యలు ఆదివారం అశ్రునయనాల మధ్య పూర్త­య్యాయి. ఉదయం ఫిలింసిటీలోని ఆయన నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీ చితికి ఆయన కుమారుడు కిరణ్‌ నిప్పంటించారు.

ప్రముఖుల నివాళి
రామోజీరావు (88) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం నుంచి ప్రముఖులు, అభిమా­నుల సందర్శనార్థం రామోజీ మృతదేహాన్ని ఫిలింసిటీలోని నివాసంలో ఉంచారు. 

ఆదివారం ఉద­యం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, టీడీపీ అధినేత చంద్రబాబు­నాయు­డు, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణా­రావు, సీతక్క, బీజేపీ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస­రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్‌­ఎస్‌ నేత నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే అరిక­పూడి గాంధీ, సినీ దర్శ­కుడు బోయపాటి శ్రీను, నటుడు మురళీ మోహన్‌ తదితరులు రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. రామోజీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

పాడె మోసిన చంద్రబాబు
ఆదివారం ఉదయం 9.30 గంటలకు రామోజీ నివా­సం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతిమ యాత్ర వాహనంపై కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి, సోహన, మనవడు సుజయ్‌­తోపాటు జస్టిస్‌ ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగే­శ్వర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు కూర్చున్నారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర స్మృతివనానికి చేరుకుంది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంతిమ యాత్ర­లో పాల్గొని రామోజీ పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. 11.30 గంటల సమయంలో రామోజీ భౌతికకా­యాన్ని చితిపై ఉంచారు. పోలీసులు గౌరవ వందనం చేసి, గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత.. రామోజీ కుమారుడు కిరణ్‌ చితికి నిప్పంటించారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)