Breaking News

తెలంగాణ: అంతటా కుండపోత.. అతిభారీ వర్షాల హెచ్చరిక

Published on Thu, 07/20/2023 - 07:15

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ నుంచి అతిభారీవర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రి వీచిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో చెట్టు, కరెంట్‌పోల్‌ పడిపోయాయి. అయితే ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. Rains lash Telangana

ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌లో భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో వాగులు ప్రవహిస్తున్నాయి.  

కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యాయి.

మెదక్‌ వెల్దుర్తిలో 15 సెం.మీలు,  దామరంచలో 13 సెం.మీ. రాజపల్లిలో 12 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.

యాదాద్రి భువనగిరి రాజాపేట మండలం పరిధిలో ఏకంగా 17 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. 

నిలిచిపోయిన రాకపోకలు 
జయశంకర్‌ భూపాలపల్లి సహా భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో 16వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వెలుతుర్లపల్లి వద్ద ఉధృతంగా మొరంచవాగు ప్రవహిస్తోంది. ధర్మారావుపేట, అప్పయ్యపల్లి, కొండాపురం, గనపురంల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద తాత్కాలిక మట్టిరోడ్డు తెగిపోయింది. దీంతో పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

వరంగల్‌ వెంకటాపురంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. 

గోదావరికి ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో..  భద్రాచలం వద్ద 39 అడుగులకు చేరింది నీరు.  43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)