తెలంగాణ: మరో నాలుగు రోజులు వర్షాలే!

Published on Wed, 05/03/2023 - 03:46

సాక్షి, హైదరాబాద్‌: ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి మరట్వాడ, ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనము కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అలాగే రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో)తో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ.. ఒక్కసారిగా మేఘావృతమైన వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.

కాగా, గత 24 గంటల్లో వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో అత్యధికంగా 8 సెంటీమీటర్లు, పెబ్బేరులో 7 సెంటీమీటర్లు, వీపనగండ్లలో 6 సెంటీమీటర్లు, కామారెడ్డి, నవీపేట్, గాంధారి, బోధన్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.  

ఇదీ చదవండి: ట్రోలింగ్‌.. సామాజిక జబ్బు!

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)