Breaking News

తెలంగాణలో పలు చోట్ల వర్ష బీభత్సం

Published on Fri, 03/21/2025 - 18:07

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి వడగళ్ల వాన కురిసింది. కాగజ్ నగర్‌లో దుకాణాలపై కప్పులు కూడా ఎగిరిపోయాయి. పోచమ్మ గుడి  ముందున్న సుమారు 150 ఏళ్ల వృక్షం నేలమట్టం అయ్యింది. దీంతో వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో వాతావరణం చల్లబడటంతో ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊరట చెందారు. రాళ్లవానతో అక్కడక్కడా మామిడి రైతులకు నష్టం. వాటిల్లింది. గాలి దుమారానికి పిందెలు రాలిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, ఎలిగేడు మండలం దూళికట్టలో వడగళ్ల వాన పడింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. బోయిన్‌పల్లి రామడుగు మల్యాల మండలాల్లో మోస్తరు కంటే ఎక్కువ వర్షం కురుస్తోంది.

 

 

 

 

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు