Breaking News

యాదాద్రి ఎంఎంటీఎస్‌కు కిషన్‌రెడ్డి అడ్డంకి

Published on Sun, 03/09/2025 - 04:53

శంషాబాద్‌: ‘నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేకమార్లు రైల్వేమంత్రికి చేసిన విన్నపంతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ మంజూరైంది. కానీ ఆ పనులు ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డియే. ప్రతి ఆదివారం యాదాద్రికి లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 

శనివారం మహబూబ్‌నగర్‌ పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో కలసి రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టు మంజూరు కోసం జీఎంఆర్‌ సంస్థ అభ్యంతరాన్ని పరిష్కరించి.. వారిని ఒప్పించింది తామేనన్నారు.

ఇప్పటికే భూసేకరణ కోసం రూ. 2 వేల కోట్లు కూడా ప్రభుత్వం కేటాయించిందన్నారు. మరో మూడు నెలల్లో కొత్తగూడెం విమానాశ్రయం కూడా మంజూరవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌లో రీజినల్‌ రింగురోడ్డుకు రైల్వేరింగు రోడ్డు కూడా ఏర్పాటు చేసుకునేందుకు రైల్వేమంత్రి అంగీకరించారన్నారు. 

సానుకూలంగా స్పందించారు..
తాము చేసిన అన్ని వినతులకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వరంగల్‌ అభివృద్ధి ఉత్తి మాటలకే పరిమితమైందని మంత్రి సీతక్క విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)