Breaking News

రైల్వేలకు సంతృప్తికరంగా నిధులు 

Published on Sat, 02/03/2024 - 06:14

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు సంతృప్తికరంగా నిధులు కేటాయించారని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. తాజా బడ్జెట్‌లో రైల్వేలకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించగా.. అందులో దక్షిణ మధ్య రైల్వేకి రూ.14,232.84 కోట్లు కేటాయించారన్నారు. ఇందులో తెలంగాణ ప్రాంత వాటా రూ.5,071 కోట్లని, గత బడ్జెట్‌ కంటే 14.7 శాతం నిధులు అధికంగా కేటాయించారని వివరించారు. శుక్రవారం ఆయన రైల్‌నిలయంలో మీడియాతో మాట్లాడుతూ, రైలు ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చనున్నట్లు వివరించారు.

ఈసారి పీఎం గతిశక్తి కింద పలు ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపారు. కవచ్‌ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ సారి రూ.41.94 కోట్లు కేటాయించారన్నారు. తాజా బడ్జెట్లో నిధులు తగ్గినట్లు కనిపించినప్పటికీ ఇది మధ్యతరం మాత్రమేనని, పూర్తిస్థాయి బడ్జెట్‌లో నిధులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భద్రాచలం రోడ్‌ – డోర్నకల్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టు కింద రూ. 770.12 కోట్లతో 54.65 కిలోమీటర్లు అభివృద్ధిచేయనున్నట్లు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ సారి రెండు బైపాస్‌ లైన్ల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారని, ఇందులో కాజీపేట్‌ బైపాస్‌ లైన్‌ 10.65 కిలోమీటర్లు, వికారాబాద్‌ మార్గంలో 2.8 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ పదేళ్లలో రాష్ట్రానికి కేటాయింపులు దాదాపు 20 రెట్లు పెరిగాయని తెలిపారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)