Breaking News

డీసీసీల అధ్యక్షులకు నేడు రాహుల్‌ క్లాస్‌

Published on Mon, 03/02/2026 - 00:45

సాక్షి, హైదరాబాద్‌/వికారాబాద్‌: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. గత పది రోజులుగా వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. 

శిక్షణ తీసుకున్న డీసీసీ అధ్యక్షులకు పార్టీ సంస్థాగత నిర్మాణం, వారి విధులు, పార్టీ ఆలోచనల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులను కలవనున్న రాహుల్‌ వారితో ఫొటో సెషన్‌లో పాల్గొననున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుల కుటుంబ సభ్యులను కూడా ఈ శిబిరానికి ఆహ్వానించారు. వారితో కూడా మాట్లాడనున్న రాహుల్‌ ఫొటోలు సైతం దిగనున్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు పీఏసీ సభ్యులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్, సంగతన్‌ సృజన్‌ అభియాన్‌ జాతీయ ఇన్‌చార్జి చల్లా వంశీచందర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, విశ్వనాథన్, సచిన్‌ సావంత్, టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి 36 మొత్తంగా 77 మంది డీసీసీ అధ్యక్షులు శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. 

రాహుల్‌ షెడ్యూల్‌ ఇదీ.. 
పీసీసీ వర్గాలు వెల్లడించిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 7:10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న రాహుల్‌గాంధీ 9:20 నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్‌ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, మంత్రులు, పార్టీ నేతలు స్వాగతం పలుకుతారు. 

అక్కడి నుంచి ఉదయం 9:40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్న రాహుల్‌గాంధీ 10 గంటలరే వికారాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హరిత రిసార్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటల వరకు శిక్షణ శిబిరంలో ఉంటారు. తిరిగి హెలికాప్టర్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని 5:30 గంటలకు ఢిల్లీ వెళ్తారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)