Breaking News

గుడ్‌ సామరిటన్లకు..‘గోల్డెన్‌’ గిఫ్ట్‌!

Published on Mon, 02/09/2026 - 06:14

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.. సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం తప్పుతుంది.. కానీ ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కేసుల్లో ఇరుక్కుని పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయమే ఇందుకు కారణం. వాస్తవానికి అలా సాయం చేసేవారికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయినా జనంలో అవగాహన రావటం లేదు. ఈ నేపథ్యంలోనే అలా క్షతగాత్రులకు సాయం చేసి ప్రాణాలు నిలిపిన వారికి రూ.25 వేల నగదు పారితోషికంతో పాటు ప్రభుత్వ ప్రశంసాపత్రం కూడా అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది.  

సర్కారు చొరవ 
కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు కొన్ని చాలాకాలంగా తెలంగాణలో అమలులో లేవు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో ముఖ్యమైన వాటిని అమలులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించిన వారికి ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. గతంలో క్షతగాత్రుల పాలిట గుడ్‌ సామరిటన్‌ (సహాయం చేసిన మంచి వ్యక్తి)కు ఆర్థిక సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలులోకి తెచ్చింది.

 తొలుత రూ.5 వేల ఆర్థిక సహాయం మాత్రమే ఉండేది. దానికి అంత స్పందన రావటం లేదన్న ఉద్దేశంతో, గతేడాది ఈ పథకానికి ‘రహ్‌ వీర్‌’అని పేరు పెట్టి, ఆర్థిక సహాయం మొత్తాన్ని రూ.25 వేలకు పెంచింది. దీన్ని అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి పథకం అమలుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ‘రహ్‌ వీర్‌’లను ఎంపిక చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసింది.  

ఎలాంటి ప్రమాదాల్లో... 
⇒ ప్రాణాపాయం కల్పించే పెద్ద ప్రమాదాల్లో క్షతగాత్రులను రక్షించే వారికి ఈ పురస్కారం అందుతుంది. పెద్ద శస్త్రచికిత్స అవసరం అవటం, కనీసం మూడు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సినంత గాయం కావటం, మెదడు, వెన్నెముకలాంటి వాటికి తీవ్ర గాయాలు కావటం, చనిపోవటం.. ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.  
⇒ క్షతగాత్రులను ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రి/ట్రామా కేర్‌సెంటర్‌కు తరలిస్తే వారికి ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్‌ అవర్‌గా పేర్కొంటారు. ఆ గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన వారిని ‘రహ్‌ వీర్‌’లుగా పరిగణనలోకి తీసుకుంటారు.  

⇒ నిర్భయంగా ముందుకొచ్చి క్షతగాత్రులు వీలైనంత తొందరలో ఆసుపత్రికి చేర్చేందుకు సాయం చేసిన వ్యక్తుల వివరాలను ఆసుపత్రి సిబ్బంది ద్వారా, లేదా స్వయంగా తెలుసుకుని సంబంధిత పోలీసులు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పనిచేసే కమిటీలకు వివరాలు అందిస్తారు.  
⇒ జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే కమిటీలో జిల్లా ఎస్పీ/ పోలీసు కమిషనర్, చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్, ఆర్‌టీఓ/డీటీఓ/డీటీసీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నగదు పురస్కారానికి అర్హులను ఎంపిక చేసి సిఫారసు చేస్తుంది. వారికి రవాణా శాఖ ద్వారా పురస్కారం అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ ఉంటుంది.  

⇒ క్షతగాత్రులకు గోల్డెన్‌ అవర్‌లో సాయం చేసిన వ్యక్తి ఒకరే ఉంటే అతనికి/ఆమెకు రూ.25 వేల పారితోషికం, ప్రశంసాపత్రం అందిస్తారు. ఇద్దరున్నా, ఎక్కువ మంది ఉన్నా.. వారికి రూ.25 వేల మొత్తాన్ని సమంగా పంచుతారు.  
⇒ ఆర్థిక సాయానికి సంబంధించి కేసులకు పరిమితి లేదు. ఎన్ని కేసులకు ఎంపిక చేసినా అన్నిటికీ పారితోషికం అందుతుంది. ఈ నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది.  

⇒ కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి రూ.25 లక్షల గ్రాంటును తొలి విడతగా అందించింది. ఎక్కువ అవసరమైతే ఆ మొత్తం ప్రతినెలా రీయింబర్స్‌ చేస్తుంది.  
⇒ మోటారు వాహన చట్టం (సవరణ) 2019 సెక్షన్‌ 134 ఏ ప్రకారం... రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సాయం చేసిన వ్యక్తికి చట్టపరంగా రక్షణ కలి్పస్తారు. వారిని అనవసరంగా పోలీసు స్టేషన్‌లకు రప్పించటం, కోర్డు చుట్టూ తిప్పటం, బలవంతంగా వారి వివరాలు సేకరించటం లాంటివి ఉండవు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు నిర్భయంగా ముందుకొచ్చి ప్రమాద క్షతగాత్రులను రక్షించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వం కోరుతోంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)