Breaking News

కమిషన్లతోనే సర్కార్‌ కాలయాపన

Published on Thu, 07/04/2024 - 04:49

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ప్రజలకు ఇ చ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఆయా అంశాలపై కమిషన్ల నియామకాలతోనే కాలయాపన చేస్తోందని బీజేపీ మెదక్‌ ఎంపీ ఎం.రఘునందన్‌రావు మండిపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ పాలకులు టైంపాస్‌ చేస్తున్నారు. 

గుంపు మేస్త్రీ సరిగా ఉంటేనే ఇతర మేస్త్రీలు కూడా పనిచేస్తారన్నారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు, వరి ధాన్యానికి మద్దతు ధర, రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణం హామీ ఏమైందని ఆయన ప్రశ్నలు సంధించారు. లక్ష్మీనరసింహస్వామి మీద, ఏడుపాయల దుర్గమ్మ మీద రేవంత్‌ ఒట్లు వేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ, దానిని ఎలా చేస్తారో చెప్పడం లేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశా రు. 

రైతు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడో అన్ని ఎకరాలకూ రైతు భరోసా ఇవ్వా లని సూచించారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటామని మాజీ సీఎం కేసీఆర్‌ చెబుతున్నారు కదా అని ఓ విలేకరి స్పందించగా.. అసెంబ్లీ సమావేశాలు ప్రా రంభం అయ్యేనాటికి మరో 15 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌ కాపాడుకోలేని పరిస్థితి తలెత్తు ­తుందని వ్యాఖ్యానించారు. మరో 15 నెలలు బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందా అనేది కూడా అనుమానమేనని, అలాంటిది మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు ఉంటామంటే ఎట్లా అని బదులిచ్చారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)