Breaking News

రఘురామ ‘క్వాష్‌’ విచారణ వాయిదా

Published on Fri, 02/14/2025 - 12:58

న్యూఢిల్లీ, సాక్షి:  ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ, ఆయన మనుషులు గతంలో ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామ వేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

శుక్రవారం(ఫిబ్రవరి 14)  జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. అయితే బాధితుడు ఫరూక్ భాషా తరఫున వకాలత్‌ దాఖలు చేయడానికి ఆయన లాయర్‌ సమయం కోరారు. దీంతో.. అందుకు రెండు వారాల గడువు ఇచ్చింది కోర్టు. అలాగే.. ఈ పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

నరసాపురం ఎంపీగా ఉన్న టైంలో.. విధుల్లో ఉన్న  ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ ఫరూక్ భాషపై  రఘురామ, ఆయన తనయుడు భరత్‌ కలిసి దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. 2022 జులైలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కానిస్టేబుల్‌ ఫరూక్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి రఘురామ మనుషులు ఆయన నివాసంలోనే చితకబాదారు. ఆపై అనుమానితుడిగా పోలీసులకు అప్పగించారు. అయితే..

రఘురామ, ఆయన మనుషులు తనను చిత్రహింసలకు గురి చేశారని ఫరూక్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో జులై 4వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో రఘురామ, ఆయన తనయుడు, రఘురామ పీఏ, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది తదితరులపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఊరట కోసం తెలంగాణ హైకోర్టులో  రఘురామ క్వాష్‌ వేయగా చుక్కెదురైంది. ఆ వెంటనే  ఆయన సుప్రీంను ఆశ్రయించారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు