Breaking News

హాస్టల్‌లో ర్యాగింగ్‌ భూతం.. జూనియర్‌ను కర్రతో చితకబాదిన టెన్త్‌ క్లాస్‌ విద్యార్థి

Published on Tue, 03/21/2023 - 08:31

సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ఓ ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో జూనియర్‌ విద్యార్థిని ఓ 10వ తరగతి విద్యార్థి చితకబాదాడు. సోమవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల హాస్టల్‌లో బాధిత బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ పదో తరగతి విద్యార్థి తాను చెప్పిందే వినాలని కొంతకాలంగా జూనియర్లను భయపెడుతూ మాటవిననివారిని కొడుతున్నాడు.

హోలీ పండగ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న తనతోపాటు మరికొందరు విద్యార్థులను లేపి డాన్స్‌ చేయమని బెదిరించాడని, చేయకుంటే కొట్టాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే నాలుగింతలు దెబ్బలు తింటారని బెదిరించడంతో ఎవరికీ చెప్పుకోలేదని బాధిత విద్యార్థి వాపోయాడు. శనివారం రాత్రి మరోమారు గదికి వచ్చి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, దెబ్బలు తాళలేక ఆదివారం ఉదయం జడ్చర్లలోని తన మేనత్త శాంతమ్మ వద్దకు వెళ్లినట్లు చెప్పాడు.

అతడి మేనత్త వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఉదయం హాస్టల్‌ వద్ద బాధిత విద్యార్థి, బంధువులు ఆందోళనకు దిగారు. ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి హాస్టల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఆవేశంలో తప్పు చేశానని, ఇకపై చేయబోనని పదో తరగతి విద్యార్థి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. త్వరలో పరీక్షలు ఉండటంతో అతడిని మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)