Breaking News

4 నెలల్లో నాలుగో వంతు రాబడి

Published on Fri, 09/08/2023 - 03:31

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నాలుగు నెలల్లో నాలుగో వంతు రాబడులు వచ్చాయి. ఈ ఏడాదికి మొత్తం రూ.2.58 లక్షల కోట్లతో బడ్జెట్‌ అంచనాలు రూపొందించగా జూలై నెల ముగిసే నాటికి రూ.67,494.73 కోట్ల మేర ఖజానాకు ఆదాయం సమకూరిందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మొత్తం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఇది 26 శాతం అన్నమాట. ఇందులో పన్నుల వాటా కింద రూ.42,712.27 కోట్లు వచ్చింది. ఆ తర్వాత అప్పుల పద్దు కింద కూడా ఎక్కువ సమకూరింది.

ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌ రుణాల ద్వారా రూ.38,234 కోట్లు సేకరించాలన్నది అంచనా కాగా, అందులో దాదాపు 54 శాతం ఇప్పటికే సమకూరింది. 2023 జూలై నాటికి రూ.20,637.23 కోట్లు అప్పుల ద్వారా సేకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు పంపిన నివేదికలో వెల్లడించింది. మొత్తం రాబడుల్లో అప్పులే 30 శాతం ఉండడం గమనార్హం.

ఇక పన్నుల ఆదాయంలో ఎక్కువగా జీఎస్టీ నుంచి రూ.15 వేల కోట్లకు పైగా వచ్చింది. మొత్తం అంచనాల్లో ఇది కూడా 30 శాతం దాటింది. ఎక్సైజ్‌ రాబడులు కూడా 30 శాతం దాటాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, పన్నుల్లో వాటా కలిపి రూ.6,300 కోట్లకు పైగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై నాటికి రాబడులు 3 శాతానికి పైగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)