పుష్ప తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌

Published on Wed, 08/06/2025 - 14:30

హైదరాబాద్‌: పుష్ప-2 ప్రివ్యూ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ చీఫ్‌ సెక్రటరీకి బుధవారం నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో బాధిత కుటుంబానికి పరిహారం అందించే విషయంలోనూ కీలక ఆదేశాలూ జారీ చేసింది. 

పుష్ప 2 చిత్ర ప్రివ్యూ షో సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో చిన్నారి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ మానవ హక్కుల కమిషన్‌లో విచారణ జరిగింది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ సీఎస్‌కు నోటీసులు పంపించింది. అలాగే.. చనిపోయిన బాధితులకు రూ. 5 లక్షల రూపాయాలు చెల్లించాలని బాధ్యులకు, అలాగే వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

కిందటి ఏడాది డిసెంబర్‌ 4వ తేదీన పుష్ప-2 చిత్ర ప్రీమియర్ షోను సంధ్యా థియేటర్‌లో ప్రదర్శించారు. అయితే అక్కడి బెనిఫిట్‌ షో కోసం అల్లు అర్జున్‌ రావడంతో భారీగా అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్‌కి చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో 146 రోజులు పాటు వైద్యం అందించారు. చివరకు 2025 ఏప్రిల్ 29న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు, కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌ అరెస్టైన సంగతీ తెలిసిందే.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)