Breaking News

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. లైంగిక వేధింపులు?

Published on Fri, 07/31/2026 - 11:35

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కాంతారావు.. తనను లైంగికంగా వేధించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

వివరాల మేరకు.. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.. తనను వివాహం చేసుకుంటానని నమ్మంచి మోసం చేశారని బాధితురాలు పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. యూట్యూబ్‌ చానెల్‌ పేరుతో ప్లాట్‌కు పిలిపించి వేధించారని పేర్కొంది. ఇదే సమయంలో కాంతారావు.. తన ప్రైవేటు ఫొటోలతో బ్లాక్‌ మొయిల్‌ చేస్తున్నారని యువతి ఆరోపించింది. అలాగే, రియల్‌ ఎస్టేట్‌ పేరుతో తన వద్ద నాలుగు లక్షలు తీసుకుని మోసం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈనెల 26న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.  

ఇదిలా ఉండగా.. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో రేగా కాంతారావు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని పిటిషన్‌ చేశారు. దీంతో, తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. 
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)