Breaking News

ఘనంగా ముగింపు వేడుకలు

Published on Thu, 12/05/2024 - 04:07

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ నగరంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. వేడుకల ఏర్పా­ట్లపై బుధవారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించా­రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చివరి మూడు రోజుల్లో మ్యూజికల్‌ నైట్‌తో పాటు నగరంలోని ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా సంఘాలు, రెస్టారెంట్లు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో 120 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 

భారీ స్థాయిలో డ్రోన్‌ షో, లేజర్‌ షో, క్రాకర్స్‌ షో వంటి కార్యక్రమాలుంటా­యన్నారు. 7న వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆధ్వర్యంలో సినీ సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని వివరించారు. ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లక్ష మంది మహిళలతో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. 

అనంతరం పెద్ద ఎత్తున డ్రోన్‌ షో, లేజర్‌ షో, క్రాకర్స్‌షో ఉంటుందని, ఆ తర్వాత సంగీత దర్శకుడు థమన్‌ ఆధ్వర్యంలో ఐమాక్స్‌ హెచ్‌ఎండీఏ మైదానంలో మ్యూజికల్‌ నైట్‌ జరుగుతుందని తెలిపారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ నుంచి పీవీమార్గ్‌ వరకు ఐదు ప్రాంతాల్లో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇదే మార్గంలో ఫుడ్‌ స్టాల్స్, హస్తకళల స్టాల్స్, పలు శాఖల స్టాల్స్‌తో పాటు సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

ట్యాంక్‌బండ్‌ నుంచి రాజీవ్‌ గాంధీ జంక్షన్, సచివాలయం, ఇందిరా గాంధీ విగ్రహం, ఐమాక్స్‌ జంక్షన్‌ నుంచి పీవీ నర్సింహారావుమార్గ్‌ వరకు పరిసరాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని ఆమె అధికారులను కోరారు. పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలకు తాగునీరు, టాయ్‌లెట్ల సదుపాయం, భద్రత కల్పించడం, పార్కింగ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్‌ వెల్లడించారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)