Breaking News

మానసిక ఒత్తిడిని తగ్గించే చాక్లెట్

Published on Tue, 01/21/2025 - 08:32

 

హైదరాబాద్‌: మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా చాక్లెట్లను తయారు చేయడం అభినందనీయమని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని దసపల్ల హోటల్ లో  హెటాఫీ డైమండ్ క్యాండి నీ ఆయన ప్రముఖ వైద్యురాలు పద్మశ్రీ మంజుల అనగాని తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లో ఆరోగ్యాలను పాడుచేసే, చెడగొట్టే ఆహార పదార్థాలు తయారవుతున్నాయని అలాంటివి కాకుండా ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినే చాక్లెట్లను ఆరోగ్యాలను పాడు చేసే విధంగా కాకుండా మెరుగుపరిచే విధంగా తయారు చేయడం నిజంగా అభినందనీయం అన్నారు.  హెటాఫీ క్యాండీ అధినేత ఎస్. సృజన్ మాట్లాడుతూ ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు ప్రపంచ స్థాయి చాక్లెట్ లను దేశం మొత్తం అందించేందుకు ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. 

కాన్ఫెక్షనరీ రంగంలో స్వదేశీ ఉత్పాదనగా ఇప్పటికే హెటాఫీ క్యాండీ గుర్తింపు పొందిందని అన్నారు. ఈ క్యాండీ పై క్లినికల్ ట్రయల్స్ జరిగి యూఎస్ఏ నుంచి ఎఫ్డియే అప్రూవల్ కూడా పొందిందని తెలిపారు. ప్రతిరోజు ఓ క్యాండీ తినే వాళ్ళకి గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ వంటి సమస్యలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిలీప్ భానుషాలి, పద్మశ్రీ గ్రహీత మంజుళ‌ అనగాని, ఇండియన్ డెంటల్‌ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సతీశ్ కుమార్ రెడ్డి, భారత ఫిజిషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెండ్ డా. జి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)