Breaking News

నిరసనల ’ప్రజావాణి’

Published on Wed, 06/12/2024 - 04:23

లక్డీకాపూల్‌: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం నిరసనలు, ఆందోళనల మధ్య సాగింది. లోక్‌సభ ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత పునఃప్రారంభమైన ప్రజావాణికి పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు అన్యాయం జరిగిందనీ, న్యాయం చేయాలంటూ వివిధ సంఘాల నేతలు ప్రజాభవన్‌ ఎదుట బైఠాయించారు.

 విధుల నుంచి తొలగించిన తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెరిగిన డీజిల్, పెట్రోల్‌ ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డ్రైవర్స్‌ కం ఓనర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాత ప్యాకేజీపై వాహనాలు నడపడం చాలా కష్టమని, ప్యాకేజీని రూ.55 వేలకు పెంచాలని అసోసియేషన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. 

ఈ మేరకు మంత్రి సీతక్కకు అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.రాజేశ్వరరావు, జి. దేవేందర్‌ వినతిపత్రాన్ని సమర్పించారు. తాను కొనుగోలు చేసిన భూమిని ధరణిలో నమోదు చేయకపోవడంతో కబ్జాకి గురైందంటూ మాజీ సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి ఇమ్మడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. 

రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 219 దరఖాస్తులు, మున్సిపల్‌ శాఖకు సంబంధించి 54, హోం శాఖకు సంబంధించి 52, హౌసింగ్‌ శాఖకు సంబంధించి 44, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 46, ఇతర శాఖలకు సంబంధించి 287 దరఖాస్తులు అందినట్లు ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్‌ శాఖ సంచాలకులు దివ్య వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజావాణి ఇంఛార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, ఆయా శాఖల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)