Breaking News

చిక్కుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం!

Published on Mon, 02/17/2025 - 14:13

రంగారెడ్డి, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్య అరాచకాలపై పేదలు నిరసన గళమెత్తారు. ఆక్రమించుకున్న తమ ఇళ్ల స్థలాలను తిరిగి అప్పజెప్పాలంటూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట పోరాటానికి దిగారు. ఈ ఆందోళనకు వామపక్ష సీపీఎం తమ మద్దతు ప్రకటించింది. 

దివంగత మహానేత వైఎస్సార్‌(YSR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంచింది. ఇందుకుగానూ ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి సర్వే నెంబర్ 189, 203లో 20 ఎకరాలను 577 మందికి పంపిణీ చేశారు. అయితే.. 2007 నుంచే ఆ స్థలాలను రామోజీ ఫిల్మ్‌ సిటీ(Ramoji Film City) యాజమాన్యం తమ గుప్పిట్లో ఉంచుకుంది. 

అప్పటి నుంచి వాళ్ల పోరాటం కొనసాగుతూనే వస్తోంది. అయితే.. లబ్ధిదారులను తమ ప్లాట్ల వద్దకు వెళ్లకుండా గేట్లు, ప్రహరీ గోడలు నిర్మాణం చేసుకుంది ఫిల్మ్ సిటీ యాజమాన్యం. దీంతో.. సీపీఎం(CPM) ఆధ్వర్యంలో బాధితులు ఇవాళ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌ హయాంలో కేటాయించిన.. ఆ ఇళ్ల పట్టాల స్థలాలను చూపించాలంటూ కలెక్టర్‌ను డిమాండ్‌ చేస్తూ  ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు