Breaking News

బంజారాహిల్స్ లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం..

Published on Mon, 02/06/2023 - 21:04

హైదరాబాద్: స్పా ముసుగులో క్రాస్‌మసాజ్‌ చేస్తూ వ్యభిచార గృహాలుగా మార్చిన నాలుగు స్పాలపై బంజారాహిల్స్‌ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్‌ చేయడమే కాకుండా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులను పునరావాసకేంద్రాలకు తరలించారు. ఈ స్పాలన్నీ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 ప్రధాన రహదారిలో కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని కృష్ణ టవర్‌లో కొనసాగుతున్న ఔరం సెలూన్‌ అండ్‌ స్పా, రోడ్‌ నెం.12లోని హదర్వా హమామ్‌ స్పా, కిమ్తి స్వేర్‌లోని ఎఫ్‌2 లగ్జరీ థాయ్‌ స్పా, బంజారాగార్డెన్‌ బిల్డింగ్‌లోని హెవెన్‌ ఫ్యామిలీ స్పాలపై దాడులు చేశారు.

 మసాజ్‌ థెరపిస్ట్‌ల పేరుతో కొంత మంది యువతులను నియమించుకొని క్రాస్‌ మసాజ్‌కు పాల్పడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దాడుల్లో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ సెలూన్‌ అండ్‌ స్పాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. ఔరం సెలూన్‌ అండ్‌ స్పాలో థాయ్‌లాండ్‌ నుంచి ఐదుగురు యువతులను రప్పించి వీరికి మసాజ్‌ థెరపిస్ట్‌ అనే పేరు తగిలించి క్రాస్‌ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా తనిఖీల్లో వెల్లడైంది. 

థాయ్‌లాండ్‌ యువతులను పునరావాస కేంద్రానికి తరలించి మేనేజర్‌ సమీర్‌పై కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు జంగం సుధాకర్‌ పరారీలో ఉన్నారు. అలాగే హదర్వ హమామ్‌ స్పా మేనేజర్‌ యామిన్‌ జిలానీ, యజమాని భీమ్‌సింగ్‌లను కూడా అరెస్ట్‌ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకుండా కస్టమర్‌ ఎంట్రీ రిజిష్టర్‌ లేకుండా, జీహెచ్‌ఎంసీ ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా వీటిని కొనసాగిస్తున్నట్లుగా బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)