Breaking News

ఆస్తిపన్ను వసూళ్లు రూ. 825.87 కోట్లు

Published on Sun, 04/02/2023 - 10:25

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, సంస్థల నుంచి ఆస్తిపన్ను రూపంలో రూ.825.87 కోట్లు వసూలయ్యాయి. జీహెచ్‌ఎంసీ మినహా 128 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో నిర్దేశిత లక్ష్యం రూ.1,146.56 కోట్లలో 72.03 శాతం మేర వసూలైంది. 2021– 22 ఏడాది ఆస్తిపన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి రూ.127.62 కోట్లు అదనంగా సమకూరాయి. ఆస్తిపన్ను వసూళ్లలో హైదరాబాద్‌ మినహా 12 కార్పొరేషన్లలో 92.33 శాతం పన్ను వసూళ్లతో ఫిర్జాదిగూడ మొదటిస్థానంలో నిలవగా, 55.02 శాతం పన్ను వసూళ్లతో నిజామాబాద్‌ చివరిస్థానంలో ఉంది. మునిసిపాలిటీలలో జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యధికంగా 97.39 శాతం, నిర్మల్‌ జిల్లా బైంసాలో అత్యల్పంగా 26.93 శాతం మాత్రమే వసూలైంది.

ఆస్తిపన్ను, భవన నిర్మాణాల ఫీజుల వసూళ్లతో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతి సంవత్సరం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. చిన్న మునిసిపాలిటీల్లో కూడా పన్నువసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో ప్రభుత్వానికి ఏయేటికాయేడు ఆదాయం పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు నెలల ముందు నుంచే కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సత్యనారాయణ మునిసిపల్‌ కమిషనర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం, ఆదాయలక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సమీక్షలు ఎప్పటికప్పుడు చేయడంవల్ల పన్నువసూళ్లలో పురోగతి స్పష్టంగా కనిపించింది. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రాంట్లతోపాటు స్వయంగా ఆదాయం సమకూర్చుకోవడం తప్పనిసరని సీడీఎంఏ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆస్తిపన్నుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రతీ మంగళ, గురు, ఆదివారాల్లో మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఏప్రిల్‌ 30లోగా ఆస్తిపన్నుచెల్లిస్తే 5 శాతం రాయితీ 
2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించినవారికి ఎర్లీబర్డ్‌ స్కీమ్‌ వర్తిస్తుందని కమిషనర్, డైరెక్టర్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సత్యనారాయణ తెలిపారు. ఆస్తిపన్ను మొత్తం చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ లభిస్తుందన్నారు. ఆస్తిపన్ను మునిసిపల్‌ కార్యాలయానికి రాకుండానే పేమెంట్‌ యాప్స్‌ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. పన్నుచెల్లింపు దారులకు మునిసిపాలిటీలు పంపించే ఎస్‌ఎంఎస్‌లలో లింక్‌ తెరిచి పన్ను చెల్లించవచ్చని, లేదంటే వాట్సాప్‌ చాట్‌బాట్‌ నంబర్‌ 90002 53342 ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)