Breaking News

రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు

Published on Sun, 05/04/2025 - 00:10

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుల కోసం పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్‌ పథకానికి మంచి స్పందన లభించింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఏడాది కాలంలో చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఏప్రిల్‌ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పించే ప్రక్రియ గత కొన్నేళ్లుగా పురపాలక శాఖ అమలు చేస్తుంది. అందులో భాగంగా 2025–26 సంవత్సరానికి 5 శాతం రాయితీని ఉపయోగించుకొన్న ప్రజలు గత నెలలోనే రూ. 400.36 కోట్లు చెల్లించారు. మొత్తం ఆస్తిపన్ను డిమాండ్‌ రూ. 2,264.84 కోట్లు ఉండగా, ఒక్క నెలలోనే ముందస్తుగా 17.68 శాతం చెల్లించడం గమనార్హం. 

ఇది పురపాలక శాఖలో ఒక రికార్డుగా సీడీఎంఏ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో రూ. 900.9 కోట్లు ఎర్లీబర్డ్‌ కింద వసూలు కాగా, జీహెచ్‌ఎంసీ మినహా మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో రూ. 400.36 కోట్లు వసూలు కావడం పట్ల పురపాలక శాఖలో హర్షం వ్యక్తమవుతోంది. 

గత సంవత్సరం ఎర్లీబర్డ్‌ కింద రూ. 317.84 కోట్లు (14.80 శాతం) వసూలు కాగా, ఈ సంవత్సరం మరో 3 శాతం పెరిగింది. మొత్తం సంవత్సరానికి వసూలు చేసే పన్నుల్లో జమ్మికుంట మునిసిపాలిటీలో ఎర్లీబర్డ్‌ కింద 54.78% , హుజురాబాద్‌ 51.85% వసూళ్లుచేసి 50 శాతం కన్నాఎక్కువగా వసూలు చేసిన జాబితాలో అగ్రగామిగా నిలిచాయి. 

అధికారులను అభినందించిన సీడీఎంఏ 
కాగా బొల్లారం, రామగుండం కార్పొరేషన్, గుమ్మడిదల, పీర్జాదిగూడ కార్పొరేషన్, తూముకుంట, మద్దూర్, గుండ్లపోచంపల్లి, నిజాంపేట కార్పొరేషన్, చౌటుప్పల్, నాగారం, నార్సింగి, సిద్దిపేట, నారాయణఖేడ్, రాయికల్, కోదాడలలో 30 శాతం కన్నా ఎక్కువగా వసూళ్లు చేసినట్లు సీడీఎంఏ శ్రీదేవి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలు గుమ్మడిదల (42%), మద్దూర్‌ (34.2%), గడ్డపోతారాం (26.24%), మొయినాబాద్‌ (21.41%), చేవెళ్ల (21.26%) ఎర్లీబర్డ్‌ వసూళ్లలో మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా తగిన సమయంలో స్పందించి ముందస్తు పన్ను వసూళ్లు చేసిన కమిషనర్లను, ఇతర అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. కాగా 10 శాతం కన్నా తక్కువ వసూళ్లు సాధించిన పురపాలికల్లో వరంగల్‌ కార్పొరేషన్, మెదక్, వర్ధన్నపేట, చేర్యాల, వైరా, పోచంపల్లి, భైంసా, ఇంబ్రహీంపట్నం, జలపల్లి, సదాశివపేట, వనపర్తి, ఆదిలాబాద్, దేవరకొండ, బోధన్, అశ్వారావుపేట, స్టేషన్‌ ఘనపూర్, ఎదుల్లపురం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ ఉన్నాయి.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)