Breaking News

అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమం

Published on Sun, 06/01/2025 - 02:34

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో కూడిన ప్రగతి నివేదికను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. 

పథకాలు.. కార్యక్రమాలు.. 
ప్రజాభవన్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టి ప్రజలందరికీ ప్రవేశం కల్పించినప్పటి నుంచి సంగారెడ్డి జిల్లాలో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మచ్నూర్‌ కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించే వరకు చేపట్టిన కార్యక్రమాలను ప్రగతి నివేదికలో ప్రభుత్వం పొందుపరిచింది. ప్రజావాణి, ప్రజాపాలన, హైదరాబాద్‌ రైజింగ్, మహాలక్ష్మి పథకం అమలు, చేయూత, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, రూ. 500కే వంట గ్యాస్‌ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయ హస్తం, రాజీవ్‌ యువవికాసం, పంట రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు, ఉచిత విద్యుత్, రైతు బీమా, ఇందిరమ్మ ఆత్మీమయ భరోసా, రైతు నేస్తం, రైతు సంక్షేమ కమిషన్‌ ఏర్పాటు, సన్నబియ్యం తదితర పథకాల అమలును నివేదికలో వివరించింది. 

వివిధ శాఖల్లో అమలు చేసిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత ప్రభుత్వ అప్పులకు చేసిన చెల్లింపులను అందులో పేర్కొంది. అలాగే తెలంగాణ వేదికగా బయో ఆసియా, ఏఐ గ్లోబల్‌ సమ్మిట్, లీడర్‌షిప్‌ సమ్మిట్, కామన్వెల్త్‌ మీడియేషన్, ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు, సీఐఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు, ఆటోమోటివ్స్‌ ఫెస్టివల్, సైబర్‌ సెక్యూరిటీ కాంక్లేవ్, భారత్‌ సమ్మిట్‌ మొదలైనవి జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

అభివృద్ధి ప్రణాళికలు కూడా.. 
సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే–2024 కోసం చేపట్టిన చర్యలను నివేదికలో ప్రభుత్వం వివరించింది. బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తీరును వివరించడంతోపాటు ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి కోసం చేసిన ప్రణాళికలను వెల్లడించింది. మెట్రో విస్తరణ, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు, హైడ్రా ఆవిర్భావం, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల గురించి తెలియజేసింది. 

కొత్త ఉద్యోగ నియామకాలను శాఖలవారీగా వెల్లడించింది. భూభారతితోపాటు స్పీడ్‌ పథకం కింద చేపట్టిన 19 ప్రాజెక్టులు, మూసీ పునరుద్ధరణ లాంటి కార్యక్రమాల అమలు గురించి వివరించింది. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ. 1,266 కోట్ల సాయం 
ప్రగతి నివేదికలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా అందించిన సాయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సీఎంఆర్‌ఎఫ్‌ కార్యక్రమంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని.. ప్రజాప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2.87 లక్షల మందికి ఈ నిధి ద్వారా రూ. 1,266 కోట్ల సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)