సూర్యాపేట: క్షణం ఆలస్యమైనా ఆ 43 మంది మృత్యుఒడిలోకే..

Published on Tue, 11/11/2025 - 02:42

సాక్షి, సూర్యాపేట: మరో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(NH-65)పై గత రాత్రి ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

హైదరాబాద్‌ నుంచి కందుకూరుకు వెళ్తున్న విహారి ట్రావెల్స్‌ బస్సులో చిట్యాల మండలం పిట్టంపల్లికి చేరుకోగానే పొగలు మొదలయ్యాయి. బస్సు సిబ్బంది అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు వెంటనే  బస్సు అద్దాలు, తలుపుల నుంచి బయటకు దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ వెంటనే బస్సు మంటల్లో కాలిపోయింది. ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

అదే నిర్లక్ష్యమా?
కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత అధికారులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై తనిఖీల పేరుతో హడావిడి చేశారు. అయితే అది రెండు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజా ఘటనతో.. నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ లపై చర్యలు తీసుకోవడంలో రవాణాశాఖ అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. 

తాజాగా పిట్టంపల్లి వద్ద ప్రమాదానికి గురైన విహారి ట్రావెల్స్‌ బస్సుకు ఫిట్నెస్‌ లేదని తేలింది. అంతేకాదు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ రిజిస్ట్రేషన్‌తో.. తెలంగాణ కేంద్రంగా ఏపీ, తమిళనాడుకు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు విహారి యాజమాన్యం నడిపిస్తోందని బయటపడింది. సీటింగ్‌ కోసమని అనుమతులు తీసుకుని స్లీపర్ మార్చేశారని.. బస్సుపై ఐదు చలాన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో.. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగాలు నిద్రమత్తు వీడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది సకాలంలో స్పందించకపోయి ఉన్నా.. ప్రయాణికులు అప్రమత్తం కావడంలో క్షణం ఆలస్యమైనా.. అంతా మృత్యువు ఒడిలోకి చేరుకునేవారేమో!. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)