Breaking News

‘ప్రైవేటు’ పుస్తకాల దందా!

Published on Sun, 06/29/2025 - 03:57

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజులకు పుస్తకాల భారం కూడా తోడు కావటంతో విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుగుతోంది. ప్రభుత్వ అధికారిక పుస్తకాలకు అదనంగా వర్క్‌షీట్ల పేరుతో లెక్కాపత్రం లేకుండా తామిచ్చే పుస్తకాలే కొనాలని స్కూళ్ల యాజమాన్యాలు హుకుం జారీచేస్తుండటంతో తల్లిదండ్రులు మౌనంగా ఆ భారాన్ని భరిస్తున్నారు. 

సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలు, వాటికి తగిన నోట్‌ పుస్తకాల కొనుగోలు విషయం తల్లిదండ్రులకు పెద్దగా భారం కాదు. ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.1,000 లోపు ఖర్చుతో పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎంపిక చేస్తున్న పుస్తకాలు కొనుగోలు చేయాలంటే ఒక విద్యార్థికి ఏడాదిపాటు చెల్లించే ట్యూషన్‌ ఫీజులో కనీసం మూడో వంతు భరించాల్సిన పరిస్థితి వస్తోంది.  

దండుకోవడమే లక్ష్యం.. 
రాష్ట్రంలో 41,628 పాఠశాలలున్నా యి. వీటి పరిధిలో 60 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలు 11,454. వీటిలో ఒకటి నుంచి పదోతరగతి వరకు 34,92,886 మంది ఉంటే.. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు 3,55,254 మంది ఉన్నారు. నర్సరీ నుంచి పదోతరగతి వరకు 38,48,140 మంది ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందిస్తుంది. 

ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలతోపాటు అదనంగా మరికొన్ని పుస్తకాలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యలు విక్రయిస్తున్నాయి. వీటిని పుస్తకాల పబ్లిషర్లతో కలిసి రూపొందిస్తున్నాయి. ఈ పుస్తకాలకు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి.. ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర)పై

ఒక్క పైసా తగ్గించకుండా బలవంతంగా విద్యార్థులకు అంటగడుతున్నారు. సగటున ఒక్కో తరగతికి రూ.6,370 చొప్పున పాఠ్యపుస్తకాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాల విక్రయాలను లెక్కిస్తే ఏటా దాదాపు రూ.2 వేలకోట్లకు పైగానే వ్యాపారం జరిగినట్లు స్పష్టమవుతోంది. 


బిల్లుకు చెల్లు.. 
ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే 85 శాతం విద్యార్థులు పుస్తకాలను కొనుగోలు చేశారు. అయితే, ఈ ‘ప్రైవేటు’పుస్తకాల విక్రయంలో స్కూళ్ల యాజమాన్యాలు ఎక్కడా లెక్కా పత్రం కనిపించకుండా జాగ్రత్తపడుతున్నాయి. చాలా స్కూళ్లలో పుస్తకాలకు నగదు మాత్రమే స్వీకనిస్తున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు అవకాశం ఇవ్వటంలేదు. 

పుస్తకాలు కొనుగోలుకు సంబంధించిన బిల్లులు (రసీదు) కూడా ఇవ్వటం లేదు. దీంతో ఈ వ్యాపారం గుట్టుగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పుస్తకాల విక్రయంపై ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లించటంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా పుస్తకాల వ్యాపారంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన దాదాపు రూ.457 కోట్లు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల ఖాతాలోకే చేరుతున్నాయి.

ప్రైవేటు పాఠశాలల్లో తరగతులవారీగా విద్యార్థుల సంఖ్య ఇలా... 
తరగతి    విద్యార్థుల సంఖ్య 
1        4,40,556 
2        3,91,179 
3        3,70,029 
4        3,81,757 
5        3,52,503 
6        3,37,579 
7        3,26,280 
8        3,26,280 
9        2,83,494 
10        2,83,229 

పుస్తకాల ధరలు రెట్టింపు చేశారు... 
నాకు ఇద్దరు పిల్లలు. 4, 5వ తరగతి చదువుతున్నారు. వీరికి గతేడాది పుస్తకాల కోసం రూ.8 వేలు ఖర్చు చేస్తే... ఈసారి ఏకంగా 15 వేలు చెల్లించాల్సి వచ్చింది. గతేడాది 4వ తరగతి విద్యార్థికి రూ.4 వేలు పుస్తకాలకు చెల్లిస్తే... ఈ ఏడాది రూ.8 వేలు అయ్యింది. అనవసరమైన పుస్తకాలు కట్టబెడుతున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి బోధన, అభ్యసన మాత్రం పట్టించుకోరు. చివరకు పాతసామాను వాడికి అమ్ముకోవాల్సిందే. 
– అఖిల, విద్యార్థి తల్లి, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా 

ఈ ఫొటోలో కనిపిస్తున్న పుస్తకాల బ్యాగులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ పాఠశాలకు చెందినవి. ఆ పాఠశాలలో పుస్తకాలు కొనుగోలు చేసినవారికి ఈ బ్యాగులో పెట్టి ఇస్తున్నారు. పుస్తకాల కోసమే స్కూలు యాజమాన్యం ఈ బ్యాగులు ప్రింట్‌ చేయించింది. అయితే, పుస్తకాలు కొనుగోలుకు సంబంధించి బిల్లు(రసీదు) మాత్రం ఇవ్వడం లేదు. రసీదు ఇవ్వాలని విద్యార్థుల తల్లదండ్రులు అడిగితే... రసీదు పుస్తకాలు లేవంటూ తెల్లకాగితంపై చీటీ రాసి చేతులు దులుపుకుంటున్నారు. 

తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం 
ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫాంలు, పుస్తకాలు విక్రయించటం చట్టరీత్యా నేరం. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే నిబంధనల మేరకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్‌ లేదా దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. 
– రేణుక, జిల్లా విద్యాశాఖ అధికారి, వికారాబాద్‌ జిల్లా 
 
ప్రభుత్వంలో 3.. ప్రైవేటులో 6..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి, రెండవ తరగతి విద్యార్థులకు 3 పాఠ్యపుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ మాత్రమే ఉంటాయి. 3, 4,5వ తరగతుల విద్యార్థులకు నాలుగు పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ ,ఈవీఎస్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) పుస్తకాలు ఇస్తారు. ఆరు నుంచి పదవ తరగతి వరకు ఆరు పాఠ్యపుస్తకాలు ఉంటాయి. 

ఇందులో మూడు లాంగ్వేజెస్, మూడు ఆప్షనల్స్‌ ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పుస్తకాలకు బదులు ప్రైవేట్‌ పాఠశాలలు సబ్జెక్టువారీ పుస్తకాలను ఎంపిక చేసుకొని అమలు చేస్తున్నారు. దీంతో ఒకటో తరగతి నుంచే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌. సైన్స్, సోషల్‌ పుస్తకాలు ఉంటాయి. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పుస్తకాలను అనుసరిస్తూ వాటికి వర్క్‌ బుక్‌లను కూడా అదనంగా జోడిస్తున్నారు.  

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)