Breaking News

నిలోఫర్‌లో ప్రైవేట్‌ మందుల దుకాణం కూల్చివేత

Published on Fri, 05/23/2025 - 04:17

సాక్షి, హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆస్పత్రిలో రాత్రికి రాత్రే నిర్మించిన మందుల దుకాణాన్ని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆదేశాల మేరకు అధికారు లు తొలగించారు. గురువారం నాంపల్లి తహసీల్దార్, ఇతర సిబ్బంది ఆస్పత్రి భవనం ఎదురుగా నిర్మించిన దుకాణాన్ని కూల్చివేయించారు. ‘రాత్రికి రాత్రే కట్టేశారు’శీర్షికన నిలోఫర్‌ ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్‌ మందుల దుకాణ నిర్మాణంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆరోగ్యశాఖలో చర్చనీయాంశమైంది. దీనిపై సీఎం కార్యాలయంతోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూను వివరణ కోరినట్టు సమాచారం. నిలోఫర్‌ ఆస్పత్రిలో ప్రైవేటు మందుల దుకాణం ఏర్పాటుకు సంబంధించిన అంశంపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ నరేంద్రకుమార్‌కు ఆదేశించారు. కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి స్పందిస్తూ నిలోఫర్‌ ఆస్పత్రి క్యాంపస్‌లో నిర్మాణా లకు ఎవరికి అనుమతి ఇవ్వ లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మెడికల్‌ షాపు కోసం డీఎంఈ, కలెక్టర్‌ నుంచి అనుమతులు తీసుకున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చెప్పడం అవాస్తవమని కలెక్టర్‌ తెలిపారు.  

ఎవరి కోసం?: నిలోఫర్‌ ఆస్పత్రిలో ప్రైవేట్‌ మందుల దుకాణం కోసం ఏకంగా పార్కు స్థలంలోనే కాంక్రీట్‌ కట్టడం నిర్మించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. సీఎం కార్యాలయ ఆదేశాలతో మంత్రి దామోదర, కలెక్టర్లతో చర్చించి మందుల దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్టు నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ ‘సాక్షి’కి ఫోన్‌లో తెలియజేశారు. 

ఎమర్జెన్సీలో అవసరమైన మందుల కోసం వైద్యులు ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఆస్పత్రి ఆవరణలోనే మందుల దుకాణం పెట్టాలని అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అయితే మంత్రి, కలెక్టర్, డీఎంఈలు సూపరింటెండెంట్‌ ప్రకటనను తోసిపుచ్చిన నేపథ్యంలో మందుల దుకాణం అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. నిజంగానే సీఎంఓ స్థాయిలో సూపరింటెండెంట్‌ను ప్రభావితం చేసేలా ఒత్తిళ్లు వచ్చా యా అని ఆరోగ్యశాఖలో చర్చ నడుస్తోంది. 

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో నిర్వహిస్తున్న మందుల దుకాణాలపై కూడా మంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వమే రోగులకు ఉచితంగా మందులు అందజేస్తున్నప్పుడు ప్రైవేట్‌ మందుల దుకాణాలకు అనుమతి ఎందుకు ఇస్తారనే ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)