Breaking News

Hyd: ఎల్లుండి నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌

Published on Sat, 11/01/2025 - 19:30

హైదరాబాద్:  ఫీజు రీయింబర్స్‌ బకాయిలు చెల్లించకపోతే నవంబర్‌ 3వ తేదీ నుంని  ప్రైవేటీ కాలేజీలను నిరవధికంగా బంద్‌ చేస్తామని ముందుగా హెచ్చరించిన ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య.. అందుకు సమాయత్తమైంది. ఎల్లుండి(సోమవారం) నుంచి ప్రైవేట్‌ కాలేజీలను నిరవధికంగా బంద్‌ చేయనున్నట్లు మరోసారి హెచ్చరించింది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో బంద్‌కు సిద్ధమైంది. 

ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థ సమాఖ్య చైర్మన్‌ రమేష్‌ బాబు మాట్లాడుతూ.. ‘ గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి రూ. 1200 కోట్ల బకాయిలు అడిగాం. పెండింగ్ ఉన్న వాటిలో కేవలం 12 శాతం మాత్రమే అడిగాం. కానీ 300 కోట్లు దసరాకి ఇచ్చి మిగతావి పట్టించుకోలేదు. నవంబర్ 1 వరకు ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం కనీసం మా గోడు కూడా వినడం లేదు. 

అందుకే 3 వ తేదీ నుంచి కాలేజీల నిరవధిక బంద్. మా మీద విజిలెన్స్ విచారణకు ఆదేశం దుర్మార్గం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేపటి వరకు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. బంద్ సమయంలో జరిగే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని యూనివర్సిటీలకు విజ్ఞప్తి చేశాం. లక్ష మంది కాలేజీల స్టాఫ్‌తో హైదరాబాద్‌లో సమావేశం. నవంబర్ 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్. ఒకటి రెండు కాలేజీలకు ఎందుకు బకాయిలు చెల్లించారు..పది పర్సంట్ లంచం తీసుకొని ఇచ్చారా ...?, ఆ కాలేజీలపై విచారణ జరపాలి. అత్యంత ఫ్రాడ్ జరిగే దగ్గర విజిలెన్స్ విచారణ చేయాలి. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నాను’ అని రమేష్‌ బాబు తెలిపారు..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)