చర్లపల్లి జైలులో జవాన్‌పై ఇస్లామిక్ స్టేట్ ఖైదీ దాడి?

Published on Wed, 11/05/2025 - 22:05

సాక్షి, హైదరాబాద్‌: చర్లపల్లి కేంద్ర కారాగారంలో విధి నిర్వహణలో ఉన్న ఓ జవాన్‌పై ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేసులో జైలుకు వచ్చిన ఖైదీ దాడికి పాల్పడిన ఉదంతమిది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది అత్యంత  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం  చర్లపల్లిలో విధులు నిర్వహిస్తున్న రాజేష్‌ అనే జవాన్‌ చేతిలో లాఠీ పట్టుకుని రౌండ్స్‌లో ఉన్నారు. జైలులోని యూనిట్‌ ఆసుపత్రి వద్ద ఆయన తనిఖీల్లో ఉండగా, అప్పడే  మాజ్ అనే ఖైదీ చికిత్స కోసం వచ్చాడు.

ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌తో తనను నిమ్స్‌ కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ రిఫర్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశాడు. చిన్న ఆరోగ్య సమస్యేనని.. అవసరమైతే రేపు మరోసారి పరీక్షించి రిఫర్‌ చేస్తామని డాక్టర్ చెప్పారు. దాంతో శివాలెత్తిపోయిన మాజ్‌.. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి తిట్లు పురాణం ప్రారంభించారు. అదే సమయంలో రౌండ్స్‌లో ఉన్న రాజేష్‌ను తీవ్రంగా దూషించారు. అంతటితో ఆగకుండా రాజేష్‌ చేతులోని లాఠీని లాక్కుని ఆయనపై దాడి చేశారు.

తోటి సిబ్బంది ఇతర ఖైదీలు వెంటనే స్పందించి మాజ్‌ను నిలువరించారు. అక్కడే విధుల్లో ఉన్న ఓ డిప్యూటీ జైలర్‌.. మరో జవాన్‌ ఆ ఖైదీపై ఎదురుదాడి చేసి రాజేష్‌ను కాపాడారు. ఐఎస్‌ సంబంధింత కేసులో మాజ్‌ చర్లపల్లి జైలుకి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అతణ్ని గతంలో అరెస్టు చేయగా.. తొలుత చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్కడ మరో ఐఎస్ ఖైదీతో కలిసి మాజ్ సెల్‌ఫోన్ కలిగి ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. దీంతో.. అతణ్ని చర్లపల్లికి తరలించారు.  జవాన్‌పై దాడి ఘటనపై చర్లపల్లి ఇన్‌ఛార్జ్‌ సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్‌ వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ యత్నించగా ఆయన ఫోన్‌లో స్పందించలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)