విద్యార్థినులపై ప్రిన్సిపాల్‌ కర్కశత్వం

Published on Mon, 12/16/2024 - 06:15

ఖానాపురం: వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం ఐనపల్లి మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్‌ అక్కడి విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఔటింగ్‌కు వెళ్లి అరగంట ఆలస్యంగా వచ్చారన్న కారణంతో రెండు గంటలపాటు బయట చలిలోనే నిల్చోబెట్టారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులకు ఆదివారం తల్లిదండ్రులను కలిసేందుకు ఔటింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో వారు తమ తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లారు.

సాయంత్రం 4 గంటలలోపు వారు తిరిగి పాఠశాలలోకి వెళ్లాల్సి ఉండగా, అరగంట ఆలస్యంగా రావటంతో ప్రిన్సిపాల్‌ వారిని లోనికి అనుమతివ్వలేదు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదురుగానే చలిలో సుమారు రెండు గంటలపాటు వేచి ఉన్నారు. అటువైపుగా వెళ్లిన పోలీస్‌ సిబ్బంది గమనించి ఆరా తీసి పిల్లలను లోపలికి పంపాలని కోరినా ప్రిన్సిపాల్‌ వినిపించుకోలేదు. ఈ విషయాన్ని పలువురు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో వివరాలు తెలుసుకోవాలని డీటీడీఓకు కలెక్టర్‌ సూచించారు. 

దీంతో రంగంలోకి దిగిన డీటీడీఓ సదరు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే విద్యార్థినులను హాస్టల్‌లోకి అనుమతివ్వాలని ఆదేశించడంతో ప్రిన్సిపాల్‌ దిగొచ్చారు. కాగా ప్రిన్సిపాల్‌ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతోనూ నిత్యం అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, తమ పిల్లలతో మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)