Breaking News

బూతులు తిడుతూ.. విద్యార్థినులను కొడుతూ..

Published on Wed, 04/02/2025 - 10:00

వికారాబాద్‌: ఉపాధ్యా­యు­ల వేధింపులు భరించలేక స్కూల్‌ భవనం పైనుంచి దూకి ప్రాణాపాయం నుంచి బయటపడిన బాలిక ఘటన­ను మరువకముందే.. ఇదే స్కూల్‌ ప్రిన్సిపల్‌ విద్యా­ర్థి­నులను బూతులు తిడుతూ, కొడుతున్న వీడియో కల­కలం రేపింది. వికారాబాద్‌ జిల్లా కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో నెల రోజుల కింద­ట ఓ పదో తరగతి విద్యార్థిని స్కూల్‌ బిల్డింగ్‌ పైనుంచి కిందికి దూకింది. 

తీవ్ర గాయాలపాలైన బాలిక కాలు విరగగా ప్రాణాలతో బయటపడింది. ఇందుకు స్కూల్‌ సిబ్బంది వేధింపులే కారణమని బాధితురాలు తెలిపింది. వి­ద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఘటనను మరువక ముందే.. ముగ్గురు బాలిక­లను తన చాంబర్‌కు పిలిపించుకున్న ప్రిన్సిపల్‌ వారిని అసభ్యకరంగా తిడు­తూ, ఇష్టానుసారం కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. 

జుట్టు ఎందుకు విరబోసుకున్నావ్‌.. యూనిఫామ్‌ ఎందుకు వేసుకోలేదు.. బయటకు ఎందు­కు వెళ్లావ్‌ అంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ దాడి చేస్తున్న దృశ్యాలను చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్త్‌ బాలిక ఆత్మహ­త్యా­యత్నానికి కారణమైన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోక­పోవ­డంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని మండి­పడుతున్నారు.

 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)