Breaking News

నేడు జగిత్యాలకు ప్రధాని మోదీ

Published on Mon, 03/18/2024 - 05:43

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ జగిత్యాలకు రానున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం జగిత్యాలలోని గీతా విద్యాలయ మైదానంలో విజయ సంకల్పసభ పేరుతో నిర్వహించతలపెట్టిన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా ఏర్పాట్లను నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌సీజీ)తోపాటు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సభ బందోబస్తుకు 1,600 మందికిపైగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే హెలికాప్టర్ల ల్యాండింగ్‌ ట్రయల్స్, కాన్వాయ్‌ ట్రయల్స్‌ విజయవంతంగా నిర్వహించారు.

మైదాన పరిసరాలను పూర్తిగా ఎన్‌ఎస్‌జీ బలగాలు తమ అ«దీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, పీఎఫ్‌ఐ, ఐఎస్‌ఐ తదితర ఉగ్రవాద సానుభూతిపరులకు పట్టున్న ప్రాంతం కావడంతో కేంద్ర, రాష్ట్ర అధికారులు భద్రత విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. అయితే జగిత్యాల విజయసంకల్ప సభకు వర్షం గండం పొంచి ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, 30–40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వర్షం, ఈదురుగాలుల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు హెలికాప్టర్‌ ల్యాండింగ్, కాన్వాయ్‌ మూమెంట్‌ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)