Breaking News

గరం మసాలా!

Published on Sun, 02/18/2024 - 04:03

సాక్షి, హైదరాబాద్‌:  సగటుజీవి నెలవారీ ఆదాయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా.. నిత్యావసరాల ధరలు మాత్రం నింగినంటుతున్నాయి. వంటింట్లోకెళదామంటే కాసింత ధైర్యం కూడగట్టుకోవాల్సిన పరిస్థితి. కుటుంబాన్ని నెట్టుకురావాలంటే బడ్జెట్‌ ఏ మూలకూ సరిపోవడంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండడం లేదు.

కిరాణా షాపులో వారం క్రితం కొన్న సామగ్రి రేటు మరో వారానికి మారిపోతోంది. ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనపు భారం పడుతోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

ఘాటెక్కి.. హీటెక్కి.. 
కొన్ని నెలలుగా గరం మసాలా ఘాటెక్కింది. కేరళలో వరదల ప్రభావంతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి ఇతర మసాలాల దినుసుల దిగుమతులు తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత మూడు నెలల్లో దాదాపు అన్ని మసాలాల ధరలు విపరితంగా పెరిగాయని హోల్‌సెల్‌ వ్యాపారులు అంటున్నారు. దీంతో యాలకుల ధర కేజీ రూ. 2,600కు చేరింది. మిరియాలు రూ. 800, లవంగాలు రూ.900, జీలకర్ర రూ.220కు చేరాయి.  

వామ్మో.. వెల్లుల్లి..   
♦ నగరంలో వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. నగర మార్కెట్లకు  సరఫరా తగ్గడంతో ప్రస్తుతం కిలో వెల్లుల్లి రూ.480కి చేరుకుంది. హోల్‌సేల్‌ మార్కెట్‌కు వెల్లుల్లిని రవాణా చేసే ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది, సుమారు 15 వాహనాలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్‌కు 24 నుంచి 30 వాహనాలు వస్తాయని హోల్‌సేల్‌ వ్యాపారులు తెలిపారు. పర్యవసానంగా దాదాపు 40 శాతం వెల్లుల్లి సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రాథమిక కారణమని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు.  

♦  గతేడాది మే నెల తొలినాళ్లలో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు పలికింది. పోయిన నెల వరకు కూడా కేజీ రూ. 160 ఉందని వర్షాకాలంలో దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు సమాచారం. అక్టోబర్, నవంబర్‌లలో కురిసిన అ కాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ము ఖ్యంగా వెల్లుల్లి అధికంగా పండించే రాజస్థాన్‌లో వెల్లుల్లి ధర పెరిగింది. ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా పడిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో వెల్లుల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది.  

రైస్‌.. రైజ్‌..  
గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్‌లో బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి.  నాణ్యమైన సన్న బియ్యం కిలోకు రూ. 65 నుంచి రూ. 70కి పైగానే చెల్లించాల్సి వస్తోంది. డిమాండ్‌ కంటే ఎక్కువ బియ్యం మార్కెట్‌కు వచ్చినా ధరలు మాత్రం తగ్గడం లేదు.  

కూర‘గాయాలే’.. 
నగరంలో అన్ని కూరగాయలు (టమాటాలు మినహా) కిలోకు రూ.80– 120 వరకు రిటైల్‌ మార్కెట్‌లో ధరలు పలుకుతున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవడంతో రాజధాని అవసరాలకు సరిపడా కాయగూరలు, ఆకు కూరలు రావడంలేదు. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.

ప్రధానంగా బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, ఎల్‌బీ నగర్, మాదన్నపేట, సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లకు కూరగాయల సరఫరా 60 శాతానికి పడిపోయింది. కొన్ని రకాల కూరగాయలు మండీల జాబితా నుంచి కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)