Breaking News

ఘాటు తగ్గుతున్న మిర్చి!

Published on Sun, 12/29/2024 - 06:03

ఖమ్మం వ్యవసాయం: మిర్చి ధర గణనీయంగా పతనమవుతోంది. రెండు, మూడు రోజులుగా ధర బాగా పడిపోయింది. గత ఏడాది పంట సీజన్‌లో గరిష్టంగా క్వింటాలుకు రూ.22,300 పలికిన మి ర్చి.. ప్రస్తుతం రూ.16 వేలకు దిగజారింది. మోడల్‌ ధర రూ.19 వేల నుంచి ఉండగా.. ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.13 వేలకు మించి పలకడం లేదు. పంట సీజన్‌తో ధరతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రూ.10 వేల మేర ధర పడిపోయింది. ప్రస్తుతం గరిష్ట ధరలు రూ.16,700 నుంచి రూ.16 వేలు గా, మోడల్‌ ధర రూ.15 వేలు మొదలు రూ.13 వేల వరకు పలుకుతున్నాయి. దీంతో అధిక ధరలు ఆశించి మిర్చిని కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకొన్న వ్యాపారులు, రైతులు లబోదిబోమంటున్నారు.  

నాణ్యత లోపం.. ఎగుమతుల మందగమనం 
కొత్త పంట సీజన్‌ ప్రారంభం కావడంతో ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న మిర్చి అంత నాణ్యంగా లేకపోవడం.. విదేశాలకు ఎగుమతులు మందగించడం వల్లనే ధర క్షీణిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మంతోపాటు చుట్టుపక్కల జిల్లాలు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పండించే ‘తేజ’రకం మిర్చిని చైనా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రధానంగా చైనాకు ఎగుమతులు అధికంగా ఉంటాయి.

ఏటా జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు చైనాలో పండుగ సీజన్‌. ఈ సమయంలో అక్కడ పరిశ్రమలు మూతపడతాయి. ఫలితంగా అక్కడి వ్యాపారులు పంటలను కొనుగోలు చేయరు. మిర్చి ధర పతనానికి ఇది ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. మిర్చి మొదటి కోతను మైలకాయ అంటారు. సాధారణంగా మైలకాయ నాణ్యత తక్కువగా ఉండడంతో ధర కూడా తక్కువ పలుకుతుంది. ఇది ఎగుమతులకు పనికిరాదు. కొత్త పంట రాకతో కోల్డ్‌› స్టోరేజీల్లో నిల్వచేసిన మిర్చికి డిమాండ్‌ తగ్గుతుంది. దానిని పాత మిర్చిగానే లెక్కిస్తారు.  
నిల్వ చేసి నష్టాల పాలు 
గడిచిన పంట సీజన్‌లో సగటున క్వింటా మిర్చి ధర రూ.20 వేల వరకు పలకగా.. అన్‌ సీజన్‌లో రూ.25 వేలకు చేరుతుందని అంతా ఆశించారు. దీంతో ధర మరింత పెరిగిన తర్వా త అమ్ముకోవచ్చన్న ఆశతో వ్యాపారులు, రైతులు పంటను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేశారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. రూ.22 వేలు మొదలు రూ.19 వేల వరకు ధర పలికిన సమయాన కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వచేయగా.. ఇప్పుడు ధర క్ర మంగా పతనమవుతుండడంతో దిక్కుతో చని స్థితిలో పడ్డారు. ఖమ్మం జిల్లాలోని కో ల్డ్‌ స్టోరేజీల్లో ఇంకా 30 శాతం వరకు మిర్చి నిల్వలు ఉండిపోయాయి. తక్కువ ధరకు అమ్ముదామనుకున్నా కొనేవారు లేరు అని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)