Breaking News

TG: సోషల్‌ మీడియాలో ‘సూసైడ్‌’ పోస్టులు!

Published on Fri, 11/28/2025 - 15:18

వనపర్తికి చెందిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి 30 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో ఆయన తండ్రితో పరీక్షల ఫీజుపై గొడవ జరిగింది. దీనికి కలత చెందిన ఆ విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. నిమిషాల వ్యవధిలోనే  సైబర్ పోలీసులకు ఓ అలర్ట్‌ వెళ్లింది. ఆలస్యం చేయకుండా లోకల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆ విద్యార్థి దగ్గరకు చేరుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

హైదరాబాద్ సాక్షి: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. ఏవరో తిట్టారనే కోపంతో లేదంటే జీవితంలో విఫలమయ్యమనే బాధతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడి తమ జీవితాలను ముగించి తమను నమ్ముకున్న వారికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపై వెంటనే స్పందించి బాధితుల ఆత్మహత్య ప్రయత్నాలను తెలంగాణ సైబర్‌ పోలీసులు భగ్నం చేస్తున్నారు.  

తెలంగాణ సైబర్ పోలీసులు ఆత్మహత్యల్ని నిరోధించడానికి సరికొత్త సాంకేతికతను వాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఆత్మహత్య ప్రేరేపిత వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులకు సమాచారం చేరేలా సిస్టమ్ రూపొందించారు. హెచ్చరికలు రావడంలో తక్షణమే స్పందించి వారి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ అలర్ట్స్ తో గడిచిన నాలుగు వారాల్లో 12 మందిని బలవన్మరణాలకు పాల్పడకుండా కాపాడినట్లు పోలీసులు తెలిపారు.

..నిజామాబాద్ లో ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహాత్య చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు. ఆ అలర్ట్స్ సైబర్ పోలీసులకు వెళ్లడంతో వెంటనే పోలీసులు అతనిని రక్షించారు. ఇలా గడిచిన 4 వారాలలో 12 మందిని రక్షించినట్లు సైబర్ పోలీసులు తెలిపారు.

సామాజిక మాధ్యమాలలో ఆత్మహాత్యలకు సంబంధించిన ఏదైనా వీడియోలు లేదంటే ఫోటోలు ప్రచురితమైతే దానికి సంబంధించిన సమాచారం వెంటనే సైబర్ పోలీసులకు చేరుతోంది. ఈ విధంగా సమాచారాన్ని అందించేలా పలు సామాజిక మాధ్యమాలతో తెలంగాణ సైబర్ పోలీసు విభాగం ఒప్పందం జరిపినట్లు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. 

సోషల్ మీడియాలో ఏవైనా అభ్యంతకర పోస్టులు పెడితే 10 నిమిషాలలోపే మాకు హెచ్చరికలు వస్తాయి. దీంతో మేము సంబంధిత పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేస్తాం అని శిఖా గోయల్ అన్నారు. దీనివల్ల ఇప్పటి వరకూ ఎన్నో ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)