Breaking News

భూముల సర్వేకు సిద్ధం కండి 

Published on Thu, 12/28/2023 - 04:18

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ భూములను సర్వే చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, సర్వేకు సంబంధించిన ప్ర తిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆ దేశించారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భూముల సర్వేలను పరిశీలించండి. అత్యాధునిక పరిజ్ఞానంతో సర్వే ఎలా చేయాలన్న దాని పై నివేదిక తయారు చేయండి’అని నిర్దేశించా రు. బుధవారం సచివాలయంలో భూపరిపాల న, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు.

భూపరిపాలన, సర్వే విభాగాల అధికారులతో సమీక్ష సందర్భంగా భూముల సర్వే అంశం చర్చకొచ్చింది. ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలు జరుగుతున్నాయని, ఏపీలో జరుగుతున్న సర్వే మోడల్‌ సర్వేగా ఉపయోగపడుతుందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన పొంగులేటి.. ఏపీలో ఏం జరుగుతోందో పరిశీలించడంతోపాటు మంచి, చెడులను విశ్లేషిస్తూ సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు.

భూముల క్రమబద్దీకరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రెవెన్యూ రికార్డుల్లో దాపరికం ఉండకూడదని చెప్పారు. వీఆర్‌ఏలకు త్వరలోనే ఐడీ కార్డులు, వేతనాలివ్వాలని, ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షల్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్, సీసీఎల్‌ఏ, సర్వే–ల్యాండ్‌ సెటిల్‌మెంట్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఆదాయమెందుకు తగ్గింది? 
రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ వృద్ధి గతంతో పోలిస్తే సహేతుకంగా లేదని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. దీనికి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పందిస్తూ గతంలో పంచాయతీల లేఅవుట్లను కూడా రిజిస్ట్రేషన్‌ చేసేవారమని, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో అవి పెండింగ్‌లో పడ్డాయని చెప్పారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాలకు తెచ్చిన సవరణలు ఇబ్బందికరంగా మారాయని, ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు

. దీనిపై స్పందించిన పొంగులేటి.. పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులతోనూ తాను మాట్లాడతానని, సుప్రీం తీర్పు ఉల్లంఘన జరగకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో ఏం చేయాలో నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.   

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)