Breaking News

8 శాఖలు.. రూ.339.46 కోట్లు

Published on Mon, 09/09/2024 - 01:27

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో ఎనిమిది శాఖల పరిధిలో ప్రధానంగా నష్టం ఎదురైందని అ«ధికార యంత్రాంగం గుర్తించింది. ఆయా శాఖల పరిధిలో రూ. 339.46 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తంగా 15,201 ఇళ్లు దెబ్బతినగా అందులో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 6,500, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 8 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని లెక్కగట్టింది. రెవెన్యూ, పశుసంవర్థక శాఖ, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ, మత్స్య శాఖల పరిధిలో నష్టంపై ప్రభుత్వానికి యంత్రాంగం నివేదిక పంపింది. 

ముఖ్యంగా 53,528 మంది రైతులకు సంబంధించి 79,914 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల రూ. 111.87 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా వరదలతో 76 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. అలాగే 45 చెరువులకు గండ్లు పడ్డాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారంపై బాధితులు మండిపడుతున్నారు. వరద ఉధృతికి ఇళ్లు కొట్టుకుపోయిన తమకు ప్రభుత్వం అరకొర సాయం చేస్తే ఎలా సరిపోతుందని ప్రశి్నస్తున్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)