Breaking News

ఏడు నెలల గర్భిణి మృతి

Published on Thu, 11/13/2025 - 08:39

మంచిర్యాల జిల్లా: వారిది ఒక అందమైన గిరిజన కుటుం బం. భర్త బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా ఉద్యోగం చేస్తుండగా, భార్య బీఎడ్‌ పూర్తి చేసి అంగన్‌వాడీ ఆయాగా పని చేస్తోంది. వారికి నాలుగేళ్ల కొడుకు ఉండగా, భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. మరో రెండు నెలలు గడిస్తే వారి కుటుంబంలో మరొకరు చేరుతారనే ఆనందంలో ఉండగా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రసవానికి ఆపరేషన్‌ చేసే సమయంలో గర్భిణీతో పాటు పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమటిచేను గ్రామపంచాయతీ సాముగూడకు చెందిన అనురాధ(35)కు సోనాపూర్‌కు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ కుడిమేత లక్ష్మణ్‌తో వివాహం జరిగింది. 

భర్త ఢిల్లీలో విధులు నిర్వహిస్తుండగా, అనురాధ తన తల్లి ఇంటివద్ద ఉంటుంది. ఏడు నెలల గర్భిణి అయిన అనురాధకు బుధవారం ఉదయం కడుపునొప్పి, ఫిట్స్‌ రావడంతో 108 అంబులెన్స్‌లో మంచిర్యాలలోని మాతాశిశు కేంద్రానికి తరలించారు. అక్కడ మరోసారి ఫిట్స్‌ రావడంతో వైద్యులు ప్రసవం చేసేందుకు ఆపరేషన్‌ చేశారు. ఈక్రమంలో అనురాధ మృతిచెందింది. కాగా పుట్టిన మగశిశువును కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో ఫిట్స్‌ రావడంతో గర్భిణి మృతిచెందిందని, కొద్ది సేపటికి శిశువు సైతం మృతిచెందినట్లు మండల పీహెచ్‌సీ వైద్యురాలు దివ్య తెలిపారు. ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్‌ రాక కోసం మృతదేహానికి ఇంకా అంత్యక్రియలు జరుపలేదు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)