గర్భస్రావంతో ప్రాణం తీశారు

Published on Wed, 10/15/2025 - 06:58

హైదరాబాద్‌: ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసిన హోంగార్డు.. గర్భస్రావం కోసం ఆర్‌ఎంపీతో చికిత్స చేయించాడు. అది వికటించి బాధితురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోంగార్డుతో పాటు మహిళా ఆర్‌ఎంపీని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూక్‌నగర్‌ మండలం రాయికల్‌ గ్రామానికి చెందిన బ్యాగరి మౌనిక (29) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ముచ్చింతల్ కు చెందిన బానూరి మధుసూదన్‌ పోలీస్‌ శాఖలో శంషాబాద్‌ ఫింగర్‌ ప్రింట్‌ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. 

మౌనికను ప్రేమిస్తున్నానంటూ ఏడేళ్ల నుంచి ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలో మౌనిక గర్భం దాల్చగా.. నాలుగు రోజుల క్రితం విషయం అతనికి తెలిసింది. దీంతో గర్భం తొలగించడానికి మౌనికను పాల్మాకులలో ఉన్న ఆర్‌ఎంపీ పద్మజ వద్దకు తీసుకువచ్చి అబార్షన్‌ చేయించాడు. వైద్యం వికటించి మౌనికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మౌనిక ఈ నెల 13న మృతి చెందింది. మృతురాలి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపైలైంగిక దాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితులు మధుసూదన్, ఆర్‌ఎంపీ పద్మజను అరెస్టు చేశారు.  

 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)