Breaking News

ప్రీతి కేసు: ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌పై ఉత్కంఠ

Published on Sat, 03/04/2023 - 08:38

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ ర్యాగింగ్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ కన్నుమూసింది మెడికో ధరావత్‌ ప్రీతి(26). ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రీతి మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా.. ఆ నివేదిక ఇప్పుడు వరంగల్‌ పోలీసులకు చేరింది. 

ప్రీతి ఉదంతంలో ఇప్పుడు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంజెక్షన్‌లతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత చికిత్స అందించిన వైద్యులు ప్రకటించారు. అయితే.. ప్రీతి తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని, ఎవరో ఇంజెక్షన్‌లు చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రీతి బ్లడ్‌ శాంపిల్స్‌ రిపోర్ట్‌లను సైతం వరంగల్‌ పోలీసులు తెప్పించుకున్నారు. 

ఇక ఫోరెన్సిక్‌ నివేదికలో ఏం ఉంది, పోలీసులు ఏం ప్రకటిస్తారనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌ మార్టం నిర్వహించగా.. ఈ నివేదిక ఆధారంగా స్పష్టమైన ప్రకటనతో అనుమానాలకు తెర దించనున్నారు వరంగల్‌ పోలీసులు.  

సాక్షి, వరంగల్‌: మరోవైపు.. మెడికో ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు సైఫ్‌ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. మొత్తం 9 మంది అందించిన కీలక ఆధారాలతో నిందితుడు సైఫ్ ను విచారిస్తున్నారు ఏసీపీ బోనాల కిషన్. రెండు రోజుల విచారణలో కీలకాంశాలే సేకరించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్‌ ఛాటింగ్‌ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో 27  స్క్రీన్ షాట్స్‌, మెసేజ్‌లను.. సాంకేతిక ఆధారాలను సరిపోల్చుతూ సైఫ్‌ను విచారిస్తున్నారు. కస్టడీ గడువు ముగిసేలోపు నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)