Breaking News

అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 03/10/2025 - 13:56

నల్గొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్షలు పడ్డాయి. దీంతో ప్రణయ్‌ తల్లిదండ్రులు(Pranay Parents) మీడియాతో మాట్లాడుతూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు.. కొడుకు సమాధిని ముద్దాడి నివాళులర్పించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అమృత తండ్రి మారుతి రావు బలవన్మరణంతో మృతి చెందగా.. ఇప్పుడు అమృత చిన్నాన్న శ్రవణ్‌కు జీవిత ఖైదు పడింది.

ప్రణయ్‌ హత్య ప్లాన్‌ అమలులో ఆరుగురు ప్రధాన సూత్రధారులని.. అందులో తన బాబాయ్‌ శ్రవణ్‌ కీలకంగా వ్యవహరించారంటూ అమృత అప్పట్లో ఘటన జరిగిన టైంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు.. శ్రవణ్‌ను ఏ6గా నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ఇవాళ తీర్పులో ఆయనకు జీవిత ఖైదు పడగా.. శ్రవణ్‌ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

ఏ తప్పు చేయకున్నా.. తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్‌ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణమంటూ ఆరోపించింది కూడా. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ.. ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామె.

ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు

సంచలనం సృష్టించిన ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. ఏ1 మారుతి మృతి చెందగా.. హంతకుడు సుభాష్‌ శర్మకు ఉరి శిక్ష పడింది. అమృత బాబాయ్‌ శ్రవణ్‌ సహా మిగతా నిందితులకు జీవిత ఖైదు పడింది. మారుతిరావు నుంచి సుపారీ అందుకున్న అస్ఘర్‌(ఉగ్రవాది కూడా), సుభాష్‌ శర్మలు అండర్‌ ట్రయల్స్‌గా ఉండగా.. మిగతా వాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చారు. పోలీసులు 1600 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయగా.. 5 సంవత్సరాల 9 నెలలపాటు విచారణ జరిగింది.

ఇదీ చదవండి: ప్రణయ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)