Breaking News

వందేళ్ల వంతెన చాన్నాళ్లు 12 ఏళ్ల వంతెనకు నూరేళ్లు

Published on Fri, 09/06/2024 - 01:46

నిజాం కాలంలో వందేళ్ల క్రితం ఖమ్మం మున్నేరుపై రాతి కట్టడంగా నిర్మించిన బ్రిడ్జి 36.9 అడుగుల మేర వరదను తట్టుకుని నిలబడింది. అదే మున్నేరుపై ప్రకాశ్‌నగర్‌ వద్ద పదేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి స్పాన్‌ మాత్రం పక్కకు జరిగింది. భారీ వరదతో బ్రిడ్జి స్పాన్‌ బేరింగ్‌ పైనుంచి పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 1న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు మున్నేరుకు భారీగా వరద వచి్చంది. 36.9 అడుగుల మేర వరద ప్రవాహం ఆరు గంటలపాటు కొనసాగింది. ఈ వరద ప్రవాహంతోనే బ్రిడ్జి స్పాన్‌ బేరింగ్‌ల పైనుంచి పక్కకు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని గంటలు వరద ఇలాగే కొనసాగితే బ్రిడ్జికి ముప్పు వాటిల్లేదని నిపుణులు చెబుతున్నారు. – ఖమ్మం మయూరి సెంటర్‌

పదిలంగా వందేళ్ల బ్రిడ్జి.. 
అనేకసార్లు భారీగా వరదల తాకిడి తగిలినా ఎక్కడా తొణుకు లేకుండా ఖమ్మం కాల్వొడ్డు వద్ద నిర్మించిన బ్రిడ్జి పదిలంగా నిలిచింది. నిజాంల కాలంలో రాతితో కట్టిన ఈ బ్రిడ్జి వద్ద పలుసార్లు 30 అడుగులకు పైగా వరద ప్రవహించినా చెక్కుచెదరలేదు. గత పదేళ్లుగా బ్రిడ్జి పని అయిపోయిందని, వందేళ్లు దాటినందున ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అధికార యంత్రాంగం, ప్రజలు చర్చించుకుంటున్నా.. సగర్వంగా నిలవడం విశేషం. కాగా, ప్రకాశ్‌నగర్‌ బ్రిడ్జిపై ఎస్‌12 స్పాన్‌ పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు.  

మూడో బ్రిడ్జిగా నిర్మాణం.. 
హైదరాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, కోదాడ, విజయవాడ ప్రాంతాల వైపు నుంచి ఖమ్మం నగరంలోకి వచ్చేందుకు మున్నేరుపై మూడు వంతెనల నిర్మాణం జరిగింది. 110 ఏళ్ల క్రితం నిజాం కాలంలో కాల్వొడ్డు వద్ద ఒక బ్రిడ్జి.. కరుణగిరి వద్ద రెండు దశాబ్దాల క్రితం మరో బ్రిడ్జి నిర్మించారు. నానాటికీ రద్దీ పెరగడంతో 2010లో ప్రకాశ్‌నగర్‌ వద్ద మున్నేరుపై మూడో బ్రిడ్జి నిర్మాణానికి నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2013లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాగా.. గత ఏడాది 30.7 అడుగులు, ఈనెల 1న 36.9 అడుగుల మేర వరద వచి్చంది. తాజా వరదతో బ్రిడ్జి నాణ్యత వెలుగులోకి వచి్చందన్న చర్చ జరుగుతోంది.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)