Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. పోలీసులకు బిగ్‌ షాక్‌!

Published on Fri, 07/05/2024 - 11:30

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణాలతో ఇప్పట్లో తాను రాష్ట్రానికి రాలేనని కీలక నిందితుడు ప్రభాకర్‌ రావు తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో మలుపు తిరిగింది.

అయితే, ప్రభాకర్‌ రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టులో విచారణను హాజరవుతానని అఫిడవిట్‌ దాఖలు చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం యూ టర్న్‌ తీసుకున్నారు. మరో వైపు.. ప్రభాకర్‌ రావుకు సీబీఐ బ్లూ కార్నర్‌ నోటీసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక, ఈ వ్యవహారంపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాలంటే ఆయన పరారీలో ఉన్నట్టు చూపాలి. కానీ, కేసు విచారణకు ముందే ప్రభాకర్‌ రావు చికిత్స కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో, ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించే అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో కేసు విషయమై ప్రభాకర్ రావును రప్పించేందుకు ప్రత్యామ్నాయం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్ధు కోరుతూ రీజనల్ పాస్‌పోర్ట్ అధికారికి కూడా పోలీసులు లేఖ రాశారు. అయితే, ప్రభాకర్ రావు పరారీలో లేనని సమాచారం ఇస్తుండటంతో విదేశీ వ్యవహారాల శాఖ పాస్‌పోర్టు రద్ధు అంగీకారం అనుమానంగానే మారింది. ఇదిలా ఉండగా.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో నిందితుడు శ్రావణ్‌ రావు సైతం విదేశాల్లోనే మకాం వేశారు. దీంతో, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ డోలాయమానంలో పడిపోయింది. విదేశాల నుంచి ప్రభాకర్‌ రావు, శ్రావణ్‌ రావు ఇండియాకు వస్తే తప్ప కేసు విచారణ ముందుకు సాగే అవకాశం లేదు.

"నేను రాలేను.." ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)