Breaking News

మేయర్‌ ఇంటి వద్ద కరెంటు పోలేదు

Published on Mon, 04/01/2024 - 08:11

హైదరాబాద్‌: ‘విద్యుత్‌పై సమీక్ష చేసి.. ఒక్క నిమిషం కూడా కరెంటు పోనియ్యం.. అని సచివాలయంలో చెప్పి  మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లగానే కరెంటు పోయింది.. ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం ఉన్న ఏరియాలో కరెంటు పోవద్దు.. రేవంత్‌రెడ్డి మీకే దిక్కు లేదు.. మీరు ప్రజలకేం గ్యారంటీ ఇస్తారు’ అని బీఆర్‌ఎస్‌ నేత వై.సతీ‹Ùరెడ్డి ఆదివారం చేసిన ట్వీట్‌తో విద్యుత్‌ అధికారులు స్పందించారు. 

శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లోని ఎన్‌బీటీనగర్‌లో కేకే, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి వచ్చారని, ఆయన ఉన్నంతసేపు ఎలాంటి కరెంటు అంతరాయం కలగలేదని, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధికారులు రీట్వీట్‌ చేశారు. ఇంటర్నల్‌ వైరింగ్‌ లోపంతో టెంపరరీగా ఏర్పాటు చేసిన ఫ్లడ్‌ లైట్లు వెలుగుతూ ఆరిపోయాయని, ఇది కరెంటు వైర్‌ సమస్య వల్ల తలెత్తిందని, అసలు కరెంటు పోలేదని స్పష్టం చేశారు. మేయర్‌ ఇంటి ముందు, పరిసర ప్రాంతాల్లో వీధి దీపాలు నిరంతరాయంగా వెలిగాయన్నారు. 

ఇదిలా ఉండగా కరెంటు పోయినట్లుగా వచి్చన వార్తల పట్ల మేయర్‌ నివాస సిబ్బంది కూడా స్పందించారు. సీఎం ఉన్నంతసేపు అసలు కరెంటు పోలేదని, ఒక వైర్‌ కదలిక వల్ల ఫ్లడ్‌ లైట్లు ఆరుతూ వెలిగాయన్నారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఇంటికి 11 కేవీ ఫీడర్‌తో స్పెషల్‌గా కరెంటు సరఫరా ఉందని బంజారాహిల్స్‌ ఏడీఈ ఆర్‌.హైమానంద వెల్లడించారు. శనివారం సీఎం వచి్చన సమయంలో మేయర్‌ ఇంటితో పాటు ఎన్‌బీటీనగర్‌లో కరెంటు అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. మేయర్‌ ఇంటి వద్ద సీఎం ఉన్న సమయంలో మూడుసార్లు కరెంటు పోయిందంటూ జరుగుతున్న దు్రష్పచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)