Breaking News

‘మమ్మల్ని బతకనివ్వండి’

Published on Sun, 04/13/2025 - 13:53

కౌటాల(సిర్పూర్‌): ‘మమ్మల్ని బతకనివ్వండి’ అంటూ కౌటాల మండల కేంద్రంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ఆదివాసీ యువజన సంఘం పేరుతో పోస్టర్లు వెలిశాయి. కౌటాలలో పలుచోట్ల గోడలపై గురువారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు వీటిని అతికించారు. ‘నిత్యం ఆదివాసీ ప్రజలపై ఆధారపడి బతికే మీరు అడవుల్లో విచ్చలవిడిగా మందుపాతరలు పెట్టడం సరికాదు.. ఇదేనా మీ సిద్ధాంతం అంటూ’ ఆదివాసీ సంఘాల పేరుతో ప్రశ్నలు సంధించారు. 

మందుపాతరలతో అమాయకు లు మృతిచెందారని, కొంతమంది ఆదివాసీలు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ‘మేము అడవుల్లోకి వెళ్లకుండా ఇంకెక్కడి కి వెళ్లాలి.. మీరు తలదాచుకోవడానికి మా ప్రాంతాలే దొరికాయా.? భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను నియంత్రించే అధికారం మీకెక్కడిది, ఆదివాసీలు బతికేదెలా..’ ‘మా ప్రాంతాలపై మీ పెత్తనం ఏంటి, తరతరాలుగా ఆదివాసీలకు మావోయిస్టులకు జరుగుతున్న నష్టాలను ముక్తకంఠంతో ప్రశ్నిద్దాం’ అని రాశారు. కాగా ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే కోణంలో జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)