Breaking News

మంత్రి కారే అడ్డుగా ఉందంటావా ?

Published on Sat, 08/02/2025 - 07:48

హైదరాబాద్‌: మంత్రి కారు ఎక్కడ పెట్టాలో కూడా మీరు చెప్తారా..? మీ సీఐ ఎవరు పిలవండి... సస్పెండ్‌ చేయిస్తా ఏమనుకుంటున్నారో..? నేనేమైనా కారును అడ్డంగా పెట్టానా కామన్‌ సెన్స్‌ లేదా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రామ్‌ మనోహర్‌తో పాటు, బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులపై రుసరుసలాడారు. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం బంజారాభవన్‌లో లబ్ధిదారులకు రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. 

ఈ నేపథ్యంలో మంత్రి కారు డ్రైవర్‌ భవన్‌ గేటు ఎదుట కారును ఆపాడు. కారు అడ్డుగా ఉందని కాస్తా పక్కకు తీయాలని బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ సీఐ సాయి ప్రకాశ్‌ డ్రైవర్‌కు సూచించాడు. మంత్రిగారు కారు ఇక్కడే పెట్టమన్నారని మేము ఇలాగే పెడతామని డ్రైవర్‌ చెప్పడంతో ట్రాఫిక్‌ సీఐకి డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సీఐ కారును పక్కకు పెట్టించారు. 

కార్యక్రమం ముగించుకుని బయటికి వచ్చిన మంత్రికి వారు ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన అక్కడే విధుల్లో ఉన్న అడిషనల్‌ డీసీపీ గోవర్ధన్‌ను పిలిచి మాట్లాడారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్‌ఐ రామ్‌ మనోహర్‌ను పిలిచి మందలించారు. ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి సస్పెండ్‌ చేయిస్తా, సస్పెండ్‌ చేయించే వరకు ఇక్కడి నుంచి కదలనంటూ మంత్రి అధికారులకు ఫోన్‌ కలిపారు. ఇంతలోనే కిందికి వచ్చిన ఎమ్మెల్యే దానం  అధికారులకు, మంత్రికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించారు.  

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)